‘టెంపర్‌’ ను కంపు చేశారట..!     2018-12-04   10:19:13  IST  Ramesh P

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కెరీర్‌లో చెప్పుకోదగ్గ చిత్రాల్లో టెంపర్‌ ముందు ఉంటుంది. ఎన్టీఆర్‌ ఆ చిత్రంలో అద్బుతమైన నటనను కనబర్చాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఎన్టీఆర్‌ నటన పీక్స్‌. అందుకే ఎన్టీఆర్‌కు ఆ చిత్రంకు గాను పలు అవార్డులు రివార్డులు కూడా వచ్చాయి. ఇప్పుడు ఆ సినిమాను హిందీ మరియు తమిళంలో రీమేక్‌ చేస్తున్నారు. మొదట హిందీ రీమేక్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హిందీ టెంపర్‌లో బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ నటించాడు. కరణ్‌ జోహార్‌ నిర్మాణంలో తెరకెక్కిన ఆ సినిమా ట్రైలర్‌ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీ ప్రేక్షకుల పరిస్థితి ఏమో కాని తెలుగు ప్రేక్షకుల మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది.

Temper Movie Remake Simmba Was Not Like That Movie-Ranveer Kapoor Viral About

తెలుగులో టెంపర్‌ చూసిన వారు హిందీ రీమేక్‌ అయిన ‘సింబ’ ట్రైలర్‌ చూస్తే ఇది నిజంగా టెంపర్‌ రీమేకేనా అంటూ ప్రశ్నించే విధంగా ఉంది. రీమేక్‌ అంటే చిన్న చిన్న మార్పులు చేయాలి తప్ప మొత్తం సినిమానే మార్చేయకూడదు. అలా మార్చేస్తే సినిమా ఫీల్‌ పోవడం ఖాయం. ఇప్పుడు హిందీ సింబలో అదే చేసినట్లుగా అనిపిస్తుంది. బాలీవుడ్‌ స్టైల్‌లో ఉండాలని,

Temper Movie Remake Simmba Was Not Like That Movie-Ranveer Kapoor Viral About

రణ్‌వీర్‌కు తగ్గట్లుగా ఉండాలని సినిమా కథను మార్చేసినట్లుగా ఉన్నారు. దాంతో మొత్తం కంపు అయినట్లుగా కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సింబ ట్రైలర్‌ చూస్తుంటే ఇది టెంపర్‌ రీమేక్‌ అన్నట్లుగా లేదని, ఇది తమిళ మూవీ సింగంకు సీక్వెల్‌ లేదా ప్రీక్వెల్‌ అన్నట్లుగా ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Temper Movie Remake Simmba Was Not Like That Movie-Ranveer Kapoor Viral About

బాలీవుడ్‌ ప్రేక్షకులకు ఇలా అయితేనే నచ్చుతుందని ఆ చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు. తెలుగులో తీసినంత పవర్‌ ఫుల్‌గా, ఎమోషన్స్‌తో ఈ చిత్రం అక్కడ తీయలేదని తెలుస్తోంది. అక్కడ ఎక్కువ రొమాన్స్‌ మరియు యాక్షన్‌ కావాలి. అందుకే అక్కడ వాటినే ఎక్కువగా చూపించే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి టెంపర్‌ రీమేక్‌ అంటూ సింబను మొదలు పెట్టి కంపు చేశారంటూ కొందరు సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు. ఈనెల చివర్లో సింబ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సినిమా ఫలితాన్ని బట్టి మేకర్స్‌ చేసింది తప్పా ఒప్పా అనేది తేలిపోనుంది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.