కేవలం 12 గంటలలో వన్ మిలియన్ క్లబ్ లో చేరిన టెంపర్ తమిళ రీమేక్!  

  • జూనియర్ ఎన్టీఆర్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన టెంపర్ సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. విలనీ షేడ్స్ తో సాగే హీరోయిజంతో ఎన్టీఆర్ ఆ సినిమా రేంజ్ కి ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. ఈ నేపధ్యంలో ఇప్పటికే టెంపర్సినిమాలో హిందీలో రణవీర్ సింగ్ హీరోగా సింబ టైటిల్ తో తెరకెక్కి రికార్డ్ స్థాయిలో రెండు వందల కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. ఇదిలా వుంటే ఈ సినిమాని స్టార్ హీరో విశాల్ తమిళంలో రీమేక్ చేసాడు. అయోగ్య టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా మీద ఇప్పటికే తమిళనాట భారీ అంచనాలు వున్నాయి. తాజాగా ఈ సినిమా తీజర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

  • Temper Movie Remake Ayogya One Million Club In 12 Hours-Hero Vishal One Hours

    Temper Movie Remake Ayogya One Million Club In 12 Hours

  • టీజర్ రిలీజ్ అయిన 12 గంటలలోనే ఊహించని విధంగా రికార్డ్ స్థాయిలో వన్ మిలియన్ వ్యూస్ ని సంపాదించుకుంది. విశాల్ కెరియర్ లో ఈ స్థాయిలో తక్కువ టైంలో ఈ స్థాయిలో వ్యూస్ తెచ్చుకున్న టీజర్ అయోగ్య కావడం విశేషం ఠాగూర్ మధు నిర్మిస్తున్న టెంపర్ రీమేక్ అయోగ్య సినిమా వెంకట్ మోహన్ దర్శకత్వంలో తెరకేక్కుతూ వుండగా ఇందులో విశాల్ కి జోడీగా స్టార్ హీరోయిన్ రాశిఖన్నా నటిస్తుంది. మొత్తానికి ఈ వ్యూస్ తో తమిళనాడులో కూడా అయోగ్య సినిమా కోసం ఆడియన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అర్ధమవుతుంది.