సమోసాల వ్యాపారి ఆదాయం చూసి అవాక్కయిన ఇన్‌కంమ్‌ ట్యాక్స్‌ అధికారులు అతడి ఆదాయం ఎంతో తెలుసా

ఉదయం నుండి రాత్రి వరకు పని చేసినా కూడా కొందరు రోజుకు అయిదు ఆరు వందల రూపాయలను సంపాదించడం గగనం అవుతుంది.అలాంటిది ఒక రోడ్డు సైడు బండి వ్యాపారి ఏకంగా సంవత్సరానికి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు.

 Telugustop2up Kachori Seller Earns Over Sixty Lakh Annually And Gets Tax Notice-TeluguStop.com

రోడ్డు పక్కన సమోసా మరియు కచోరీలు అమ్ముతున్న వ్యాపారి రోజుకు మూడు వేలకు పైగా వ్యాపారం చేస్తున్నాడట.చాలా ఏళ్లుగా ఈయన వ్యాపారం నిర్వహిస్తున్నాడు.

సంవత్సరంలో 70 లక్షల నుండి కోటి రూపాయల వరకు ఆదాయం వస్తుందని ఆయన స్వయంగా చెప్పుకొచ్చాడు.అతడి ఆదాయం గురించి తెలిసిన ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఆఫీసర్స్‌ అతడి వద్దకు వెళ్లి ఎంక్వౌరీ చేసి ఆశ్చర్యపోయారు.

సమోసాల వ్యాపారి ఆదాయం చూసి అవ�

పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌ ప్రాంతంలో ఉన్న సీమా అనే సినిమా థియేటర్‌ పక్కన ముఖేష్‌ అనే ఒక చిన్న వ్యాపారి బండి నడిపిస్తున్నాడు.చిన్న షాప్‌ అయినా కూడా అక్కడ సమోసా మరియు కచోరీ చాలా ఫేమస్‌.సమోసాలు మరియు కచోరీ కోసం చాలా దూరం నుండి వస్తారు.ముఖేష్‌ సమోసాలు చాలా ఫేమస్‌ అవ్వడంతో రేటు ఎక్కువ అయినా కూడా కొనుగోలు చేసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు.ప్రతి రోజు ఖర్చులన్నీ పోను రెండు మూడు వేల రూపాయల వరకు ముఖేష్‌ లాభం పొందుతాడట.

ఈ విషయాన్ని తెలుసుకున్న ఐటీ అధికారులు తాజాగా ముఖేష్‌ సమోసా కచోరీ బండి వద్దకు వెళ్లారు.ఇంత వ్యాపారం చేస్తున్న వ్యక్తి జీఎస్టీ పరిధిలో లేకపోవడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.

సమోసాల వ్యాపారి ఆదాయం చూసి అవ�

చిల్లర దుఖాణాల వారు కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నారు.కోట్ల రూపాయల టర్నోవర్‌ ఉన్న ఈ షాప్‌ జీఎస్టీ పరిధిలోకి రాకపోవడంతో అధికారులు వెంటనే జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ తీసుకోవాల్సిందే అంటూ ఆదేశించారు.తనకు ఇవన్ని తెలియవు అన్న ముఖేష్‌ అధికారుల సూచన మేరకు తప్పకుండా జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ తీసుకుంటానని అన్నాడు.ఇకపై ముఖేష్‌ వద్దకు వచ్చే కస్టమర్లకు రెగ్యులర్‌ రేటుతో పాటు ఇకపై జీఎస్టీ కూడా పడబోతుంది.

సంవత్సరంలో రెండున్నర లక్షల వరకు జీఎస్టీ వసూళ్లు అయ్యే అవకాశం ఉందని ఐటీ అధికారులు అంటున్నారు.ఇలాంటి రోడ్డు సైడ్‌ వ్యాపారులు ఎంత మంది ఉంటారని, అంతకు మించి సంపాదించే వారు కూడా ఉన్నారని వారిని ఐటీ అధికారులు ఎందుకు పట్టించుకోరంటూ సాదారణ జనాలు ప్రశ్నిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube