బీజేపీ లో చేరిక పై క్లారిటీ ఇచ్చిన రాజగోపాల్ రెడ్డి

తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు స్థానం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించిన సంగతి తెలిసిందే.అయితే ఆయన గత కొద్దీ రోజులుగా కాంగ్రెస్ ను వీడి బీజేపీ లో చేరుతున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో ఆయన తాజాగా కుండ బద్దలు కొట్టినట్లు తెలిపారు.

 Telugustop2komatireddy Rajagopal Reddy Announce To Joining In Bjp Party-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ నేతలపై ఆయన మండిపడ్డారు.తప్పు వాళ్ళు చేసి,నాకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం ఏంటి అని తీవ్రంగా మండిపడ్డారు.

నన్ను నమ్ముకున్న ప్రజాలకు న్యాయం చేయాలి అంటే నేను బీజేపీ లోకివెళ్ళాలి అని,తెలంగాణ లో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాలి అనుకుంటే అది బీజేపీ కే సాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ పదవి కోరుకున్న మాట వాస్తవమేనన్న కోమటిరెడ్డి ప్రజల మద్దతుతో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవాలనుకున్నా కానీ, అనుకున్న ఫలితాలను సాధించలేకపోయాం అని అన్నారు.

అయితే ఇప్పుడు నాకేం పదవులు వద్దు, ఒకవేళ ఇచ్చినా కాంగ్రెస్‌లో ఉండను అని ప్రకటించారు.

అయితే ఒక్క వారంపదిరోజుల్లో అధికారికంగా బీజేపీలో చేరబోతున్నానని, నా మద్దతు దారులందరూ కూడా నా వెంటే ఉన్నారు అని రాజగోపాల్ రెడ్డి తెలిపారు.

అలానే రాబోయే రోజుల్లో బీజేపీదే అధికారం అంటూ ధీమా వ్యక్తం చేశారు.దీంతో, కోమటిరెడ్డి బీజేపీలో చేరతారు అంటూ గత కొద్దికాలంగా సాగుతోన్న ప్రచారానికి ఆయన వ్యాఖ్యలు తెరపడినట్లు అయ్యింది.

ఆయన తాజా ప్రకటన తో త్వరలో ఆయన కమలం గూటికి చేరుతున్నారు అన్న విషయం కన్ఫర్మ్ అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube