యూపీ లో దారుణం మూడు నెలల పసిబిడ్డను పీక్కుతిన్న కుక్కలు  

Street Dogs Terminate Three Months Old Baby-shaharan Pure,sithapure,street Dogs,utherpradesh,ఉత్తర ప్రదేశ్‌,సీతాపూర్

ఉత్తర ప్రదేశ్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మూడు నెలల పసికందును వీధికుక్కలు పీక్కుతిన్న ఘటన స్థానికంగా కలకలం రేగింది. ఉత్తరప్రదేశ్ లోని షహరన్ పూర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది..

యూపీ లో దారుణం మూడు నెలల పసిబిడ్డను పీక్కుతిన్న కుక్కలు -Street Dogs Terminate Three Months Old Baby

సోమవారం రాత్రి మూడు నెలల పసికందును వేసుకొని తల్లి తండ్రి నిద్రపోయారు. ఈ క్రమంలో కుక్కలు రాత్రి పూట అక్కడకి చేరుకొని పసికందును లాక్కెళ్లి పోయాయి. దీనితో వీధి కుక్కలు అన్నీ కూడా ఒక్కసారిగా ఎగబడడం తో చిన్నారి తల మొండెం రెండు వేరుపడ్డాయి.

దీనీతో తల భాగం ఒకచోట, మొండెం భాగం దగ్గరలోని పోలవరం వద్ద వదిలి పారిపోయాయి. అయితే చిన్నారి తల్లి దండ్రులు తెల్లారి లేచి చూసేసరికి పక్క లో పిల్లాడు లేకపోవడం గమనించి వెతకగా తల లేని శరీరం పొలంలో కనిపించడం తో వారు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. తమ చిన్నారిని కుక్కలు ఇంత దారుణంగా పీక్కుతినడం వారి మనసులను కదిలించివేసింది.

గతంలో కూడా ఉత్తర ప్రదేశ్ లో ఇలాంటి ఘటనలు చాలా నే చోటుచేసుకున్నాయి. సీతాపూర్ జిల్లా లో గత ఏప్రిల్ నెలలో దాదాపు డజను మంది పిల్లల్ని వీధి కుక్కలే పొట్టనపెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఇన్ని ఘటనలు చోటుచేసుకుంటున్నా అక్కడి ప్రభుత్వం ఈ ఘటనలపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్న విషయం మాత్రం తెలియడం లేదు.

అభం శుభం తెలియని చిన్నారులు ఈ వీధి కుక్కల వలన ముక్కు పచ్చలారని వారి జీవితాలను పోగొట్టుకుంటున్నారు. మరి ఇప్పటికైనా అక్కడి ప్రభుత్వం ఈ ఘటనలపై స్పందించి తగు కఠిన చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.