బిగ్‌బాస్ సీజన్ 3 మొదటి వారం ఎలిమినేషన్ పక్రియ మొదలైంది.మొదటి వారంకు గాను ఎలిమినేషన్ జాబితాలో జాఫర్, హేమ, రాహుల్, వితిక షేరు, పునర్ణవి, హిమజ ఉన్నారు.
ఈ ఆరుగురిలోంచి ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవ్వబోతున్నారు.మొదటి వారంలోనే బయటకు రాబోతున్న ఆ దురదృష్టవంతుడు ఎవరో అనేది శనివారం లేదా ఆదివారం వెళ్లడయ్యే అవకాశం ఉంది.
ఇక నిన్న రాత్రి నుండి మొదలైన ఓటింగ్ సరలిని చూస్తే హిమజకు ఎక్కువగా ఓట్లు పడుతున్నట్లుగా స్టార్ మా ద్వారా తెలుస్తోంది.
షోలో హిమజ ఉండాలని ఎక్కువ శాతం మంది కోరుకుంటున్నారు.ఆమె ఎమోషనల్‌గా మాట్లాడిన మాటలు వర్కౌట్ అయ్యాయి.ఆమె కన్నీరు పెట్టుకుని అందరి గుండెలను పిండేసింది.
ఆమె కన్నీరు పెట్టుకున్నందుకు కారణం ఉంది.ఆ కారణంతోనే ఎక్కువ శాతం ఆమెకు ఓట్లు పడుతున్నట్లుగా చెబుతున్నారు.
ఇక ఆ తర్వాత స్థానంలో వితిక షేరుకు ఓట్లు పడుతున్నాయి.వరుణ్ కు జోడీగా వితిక ఉండాలని అంతా భావిస్తున్నారు.
అందుకే ఆమెకు కూడా బాగానే ఓట్లు పడుతున్నాయి.
ఇక జాఫర్ మరియు రాహుల్‌లకు తక్కువ ఓట్లు పడుతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.
వీరిద్దరిలో ఒకరు మొదటి వారంలోనే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.పునర్ణవికి కూడా ఆ శాతం ఎక్కువే అయ్యి ఉండవచ్చు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరి ఆదివారం ఇంటి నుండి బయటకు వచ్చే ఆ దురదృష్టవంతుడు ఎవరో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.