కమిట్ మెంట్ ఇస్తే అవకాశంతో పాటూ లక్ష రూపాయలు ఇస్తానన్నాడు... 

ఈ మధ్యకాలంలో కొందరు యువ నటి నటులు తమ నటనా ప్రతిభను నిరూపించుకుని వెండితెరపై రాణించాలని ఎన్నోకలలతో, ఆశలతో సినిమా ఇండస్ట్రీకి వస్తున్నారు.కానీ కొందరు ఈ విషయాన్ని అలుసుగా తీసుకొని లైంగికంగా వేధించడం, అవకాశాల పేరుతో వాడుకొని వదిలేయడం మరియు ఆర్థికంగా మోసం చేయడం వంటివి చేస్తున్నారు.

 Telugu Young Heroine Swetha Varma Sensational Comments On Casting Couch In Film-TeluguStop.com

కాగా తాజాగా తెలుగులో “రాణి” అనే ఇండిపెండెంట్ చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి పరిచయమైన యంగ్ హీరోయిన్ “శ్వేత వర్మ” తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ విషయంపై ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని స్పందించింది.

అయితే ఈ ఇంటర్వ్యూ లో భాగంగా ఇంటర్వ్యూ చేసే యాంకర్ మీరు సినిమా పరిశ్రమలో “క్యాస్టింగ్ కౌచ్” సమస్యను ఎదుర్కున్నారా…? అని ప్రశ్నించాడు.దీంతో శ్వేత వర్మ ఈ విషయంపై స్పందిస్తూ సినిమా ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ సమస్య ఉందని కానీ ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి ఈ కాస్టింగ్ కౌచ్ ఈ విషయంపై అవగాహన పెరగడంతో ప్రతి ఒక్కరూ చాకచక్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకొచ్చింది.అలాగే తను షార్ట్ ఫిలిమ్స్ లో నటించేటప్పుడు కొంత మంది సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కమిట్ మెంట్ అడిగే వాళ్లని కానీ తనకు ఆ సమయంలో కమిట్ మెంట్ గురించి పెద్దగా అవగాహన లేదని దాంతో ఈ కమిట్ మెంట్ విషయానికి కొంతమేర దూరంగా ఉన్నానని తెలిపింది.

Telugu Rani, Swetha Varma, Telugu, Telugu Young, Teluguyoung-Movie

ఆ తర్వాత 2015వ సంవత్సరంలో పలు వాణిజ్య సంస్థల ఉత్పత్తులను ప్రమోట్ చేసే యాడ్స్ లో నటించే అవకాశం వచ్చిందని ఆ సమయంలో కూడా కొంతమంది యాడ్స్ డైరెక్టర్స్ కమిట్ మెంట్ అడిగారని అంతేకాక తమకు కమిట్ మెంట్ ఇస్తే లక్ష రూపాయల డబ్బు కూడా ఇస్తామని ఆఫర్ చేసినట్లు చెప్పుకొచ్చింది.అలాగే తాను ఇప్పటి వరకూ ప్రత్యక్షంగా ఎప్పుడూ కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ సమస్యలని ప్రత్య క్షంగా ఎదుర్కోలేదని కేవలం ఆన్ లైన్ మరియు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మాత్రమే ఎదుర్కొన్నానని క్లారిటీ ఇచ్చింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే శ్వేత వర్మ “పచ్చీస్” అనే చిత్రంలో ప్రధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.ఈ చిత్రానికి నూతన దర్శకుడు “శ్రీ కృష్ణ” దర్శకత్వం వహించాడు.

కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగులు నిలిపివేయడంతో ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు.అయితే నటన పరంగా నటి శ్వేత వర్మ కి మంచి టాలెంట్ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఆమె టాలెంట్ ని నిరూపించుకునేందుకు సరైన అవకాశం రాకపోవడంతో కెరీర్ కోసం బాగానే శ్రమిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube