పెళ్లి పీటలు ఎక్కబోతున్న మరో యంగ్ హీరోయిన్....  

తెలుగులో నూతన దర్శకుడు రవి కిరణ్ కోల దర్శకత్వం వహించినటువంటి “రాజావారు రాణీవారు” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన రహస్య గోరఖ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు వచ్చి రావడంతోనే తన మొదటి చిత్రంతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

TeluguStop.com - Telugu Young Heroine Rahasya Gorak Is Marrying To Her Child Friend

దీంతో పలువురు తెలుగులో యంగ్ హీరోల చిత్రాల్లో నటించే అవకాశాలను కూడా దక్కించుకున్నట్లు సమాచారం.

అయితే తాజాగా ఈ అమ్మడు గురించి సోషల్ మీడియా మాధ్యమాలలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది.

TeluguStop.com - పెళ్లి పీటలు ఎక్కబోతున్న మరో యంగ్ హీరోయిన్….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

  ఇంతకీ ఆ వార్త ఏమిటంటే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో రహస్య గోరఖ్ రహస్యంగా తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లిచేసుకోబోతున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్నాయి. దీనికితోడు ఇటీవల రహస్య గోరఖ్ పెళ్ళిలో ధరించే సంప్రదాయ దుస్తులను ధరించి ఫోటోలు షేర్ చేయడంతో ఈ వార్తలు నిజమేనని కొందరు నమ్ముతున్నారు.

కానీ ఇప్పటి వరకు రహస్య గోరఖ్ తన పెళ్లిపై వస్తున్నటువంటి వార్తలను గురించి మాత్రం స్పందించ లేదు.  దీంతో నిజమెంతుందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.అయితే ఈ విషయంపై కొందరు నెటిజన్ల స్పందిస్తూ ఈ మధ్య కాలంలో నటీనటులు పలు ప్రకటనల్లో  నటిస్తూ సంప్రదాయ దుస్తులను ధరిస్తూ ఫోటోలు షేర్ చేసినంత మాత్రాన వారు పెళ్లి చేసుకోబోతున్నట్లు ఎలా అనుకుంటారని కామెంట్ చేస్తున్నారు.

ఈ  విషయం ఇలా ఉండగా రహస్య గోరఖ్ ప్రస్తుతం తమిళంలో ఓ ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం.

 కాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు చెన్నై పరిసర ప్రాంతంలో జరుగుతున్నాయి.

#TeluguYoung #Rahasya Gorak #RahasyaGorak #RahasyaGorak

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు