రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న విజయ్ దేవర కొండ చెల్లి...

తెలుగులో ప్రముఖ దర్శకుడు పరుశురాం దర్శకత్వంలో వహించిన “గీత గోవిందం” చిత్రంలో హీరో విజయ్ దేవరకొండ చెల్లెలి పాత్రలో నటించి ప్రేక్షకులను బాగానే అలరించిన హీరోయిన్ మౌర్యాని గురించి సినిమా ప్రేక్షకులకి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు ఈ చిత్రంలో నటించడానికంటే ముందు పలు చిన్న బడ్జెట్ చిత్రాల్లో నటించింది.

 Telugu Young Heroine Mouryani Got A Chance In Romantic Thriller Movie-TeluguStop.com

 కానీ ఆ చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.దాంతో ఈ అమ్మడికి హీరోయిన్ గా గుర్తింపు రాలేదు.

అయితే ఈ మధ్య  మౌర్యాని వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ బాగానే రాణిస్తోంది.

 Telugu Young Heroine Mouryani Got A Chance In Romantic Thriller Movie-రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న విజయ్ దేవర కొండ చెల్లి…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా మౌర్యాని తెలుగులో “దేవరకొండలో విజయ్ ప్రేమ కథ” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ చిత్రంలో  యంగ్ హీరో విజయ్ శంకర్ నటిస్తుండగా నూతన దర్శకుడు ఎస్.వెంకట రమణ దర్శకత్వం వహిస్తున్నాడు.ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని యూట్యూబ్ లో చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు.అయితే ఈ రొమాంటిక్ లవ్ థ్రిల్లర్ తరహాలో తెరకెక్కినట్లు తెలుస్తోంది.

అయితే ఈ చిత్రంలో నటించింది కొత్త నటీనటులే అయినప్పటికీ తమ నటనతో బాగానే ఆకట్టుకున్నారు.దీంతో మౌర్యాని కూడా ఈ చిత్రం హిట్ అయ్యి తనకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందని గంపెడు ఆశలతో ఉంది.

మరి ఈ అమ్మడి ఆశలు నెరవేరుతాయా లేదో చూడాలి.

ఈ విషయంలో ఇలా ఉండగా ఇటీవలే మౌర్యాని తెలుగులో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు “గోపీచంద్ మలినేని” దర్శకత్వం వహించిన క్రాక్ చిత్రంలో విలన్ “కఠారి కృష్ణ” కూతురి పాత్రలో నటించింది.

ఈ చిత్రం మంచి హిట్ అవడంతో ఈ అమ్మడి కి కూడా బాగానే పాపులారిటీ వచ్చింది.దీంతో ఇటీవలే మౌర్యాని ఓ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.

కాగా ఆ మధ్య ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన స్పష్టం చేసింది.కానీ ఇప్పటి వరకూ తన నటనా ప్రతిభను నిరూపించుకునేందుకు సరైన అవకాశం రాలేదని చెప్పాలి…

.

#Mouryani #TeluguYoung #TeluguYoung #MouryaniNew

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు