క్యాస్టింగ్ కౌచ్ సినిమా పరిశ్రమలోనే కాదు అన్ని చోట్లా ఉంది....

తెలుగులో ప్రముఖ దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వం వహించిన “ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు పరిచయమైన నూతన హీరోయిన్ “చందన్ కొప్పి శెట్టి” గురించి సినిమా ప్రేక్షకులకు సుపరిచితమే.అయితే చందన సినిమాల్లోకి రాక ముందు మోడలింగ్ రంగంలో కొంతకాలం పాటు పని చేసింది.

 Telugu Young Heroine Chandana Koppisetty Sensational Comments On Casting Couch-TeluguStop.com

ఆ తర్వాత తెలిసిన వారి ద్వారా ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుని తన నటనా ప్రతిభను నిరూపించుకుంది.కాగా తాజాగా చందన ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని టాలీవుడ్ సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ విషయంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఇందులో భాగంగా ఇంటర్వ్యూ చేసే యాంకర్ టాలీవుడ్ సినిమా పరిశ్రమలో “మీరు క్యాస్టింగ్ కౌచ్ సమస్యలను ఎదుర్కొన్నారా.?” అని ప్రశ్నించింది.దీంతో చందన ఈ విషయంపై స్పందిస్తూ తాను ఇప్పటివరకు మంచి పేరున్న దర్శకులతో పని చేశానని కాబట్టి తనకు ఎప్పుడు కూడా క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఎదురు కాలేదని స్పష్టం చేసింది.అంతేకాక క్యాస్టింగ్ కౌచ్ సమస్య అనేది కేవలం సినిమా పరిశ్రమలో మాత్రమే కాదని ఇతర రంగాల్లో కూడా ఉంటుందని కానీ సినిమా పరిశ్రమలో పనిచేసే వ్యక్తులు రోజు అందరికీ కనిపించడంతో “కేవలం వారు మాత్రమే హైలైట్ అవుతారని” తెలిపింది.

 Telugu Young Heroine Chandana Koppisetty Sensational Comments On Casting Couch-క్యాస్టింగ్ కౌచ్ సినిమా పరిశ్రమలోనే కాదు అన్ని చోట్లా ఉంది….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాక కమిట్మెంట్ అనేది నటుడు లేదా నటి యొక్క వ్యక్తిగతమని అందులో ఇతరులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదని కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.అయితే ఈ మధ్య కాలంలో కొందరు అవకాశాల పేరుతో మోసపోయిన తర్వాత తమకు అన్యాయం జరిగిందని అంటున్నారని ఒకవేళ వారికి కమిట్ మెంట్ ఇచ్చిన తరువాత అవకాశాలు వచ్చి ఉంటే బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళా…? అంటూ ప్రశ్నించింది.

అంతేగాక తనకు కూడా ఇటీవలే ఓ పెద్ద హీరో నటిస్తున్న చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చిందని కానీ ఆ చిత్రంలో తన సన్నివేశాలు కొంతమేర బోల్డ్ మరియు టాప్ లెస్ తరహాలో నటించాల్సి ఉందని అందువల్లనే ఆ ఆఫర్ కి నో చెప్పినట్లు తెలిపింది.అంతేగాక సినిమా పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకి అవకాశాలు రావనే మాట అవాస్తవమని, అలాగే మనలో టాలెంట్ ఉంటే ఎక్కడైనా అవకాశాలు వస్తాయని ఉదాహరణగా టాలీవుడ్ సినిమా పరిశ్రమ నుంచి బాలీవుడ్ సినిమా పరిశ్రమకి వెళ్లి సెటిలైన తెలుగు నటీనటులు కూడా చాలామంది ఉన్నారని తన అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది.

#UmaMaheswara #TollywoodFilm #Casting Couch #TeluguYoung

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు