గ్లామర్ షో చేస్తున్న యంగ్ బ్యూటీ అవకాశాల కోసమేనా..?

ఒక్కోసారి కొంతమంది నటి నటులకి అందం, అభినయం, నటనా ప్రతిభ వంటివి మెండుగా ఉన్నప్పటికీ తమ ప్రతిభను నిరూపించుకునేందుకు సరైన అవకాశం రాక గుర్తింపుకు నోచుకోలేకపోయినటువంటి నటీనటులు చలన చిత్ర పరిశ్రమలో చాలామంది ఉన్నారు.అయితే ఇందులో తెలుగులో స్టార్ నాని హీరోగా నటించిన “మజ్ను” చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన మలయాళ బ్యూటీ “అను ఇమ్మానియేల్” కూడా ఈ కోవకే చెందుతుంది.

 Telugu Young Heroine Anu Emmanuel Glamour Show, Telugu Young Heroine, Anu Emmanu-TeluguStop.com

అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే నేచురల్ స్టార్ నాని వంటి స్టార్ హీరోతో నటించే అవకాశం దక్కించుకున్నప్పటికి తన తదుపరి చిత్ర కథల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో సినిమా పరిశ్రమలో అవకాశాలను కోల్పోయింది.అంతేగాక టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోతో “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” చిత్రంలో కలిసి నటించినప్పటికీ ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో గుర్తింపుకు నోచుకోక లేకపోయింది.

దీంతో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు అను ఇమ్మానియేల్ పరిస్థితి మారింది.

అయితే ఈ మధ్య కాలంలో అనూ ఇమాన్యుల్ మళ్లీ టాలీవుడ్ సినిమా పరిశ్రమపై పూర్తిగా దృష్టి సారించింది.

ఈ క్రమంలో తన అందాల ఆరబోతతో తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న అవకాశం వస్తే కచ్చితంగా బోల్డ్ షో చేయడానికి కూడా సిద్ధమేనంటూ పలు హాట్ ఫోటో షూట్లతో పాల్గొంటూ దర్శక నిర్మాతలకు సిగ్నల్స్ పంపుతోంది.కాగా ఈ మధ్యకాలంలో నటి అనూ ఇమాన్యుల్ గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియా మాధ్యమాలలో రోజురోజుకి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ ని పెంచుకుంటోంది.

అయితే తాజాగా అను ఇమ్మానియేల్ క్లీవేజ్ షో చేస్తూ దిగిన ఫోటోలను తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.దీంతో ఒక్కసారిగా నెటిజన్లు ఫిదా అయ్యారు.

అంతేకాకుండా సినిమా పరిశ్రమలో రాణించాలంటే అందం, అభినయంతో పాటు కూసింత అదృష్టం కూడా ఉండాలని కాబట్టి హిట్ వరించేంత వరకూ కష్టపడాలంటూ సూచిస్తున్నారు.

Telugu Anu Emmanuel, Prema Kadanta, Telugu, Telugu Young, Teluguyoung-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఆ మధ్య అను ఇమ్మానియేల్ తెలుగులో ప్రముఖ హీరో అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన అల్లుడు అదుర్స్ చిత్రంలో హీరోయిన్ గా నటించింది కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.దీంతో టాలీవుడ్ లో ఈ అమ్మడికి సినిమా అవకాశాలు కరువయ్యాయి.అయితే ఎట్టకేలకు ఇటీవలే తెలుగు యంగ్ హీరో అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న “ప్రేమ కాదంట” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube