తమ్ముడు మూవీని రీమేక్ చేయాలని ఉందంటున్న యంగ్ హీరో...

తెలుగులో ప్రముఖ దర్శకురాలు బీవీ.నందిని రెడ్డి దర్శకత్వం వహించిన “ఓహ్ బేబీ” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోగా పరిచయమైన యంగ్ హీరో తేజ సజ్జ గురించి సినీ పరిశ్రమలో తెలియనివారుండరు.

 Telugu Young Hero Teja Sajja Want To Remake Pawan Kalyan Tammudu Movie-TeluguStop.com

అయితే ఈ చిత్రంలో హీరోగా నటించడానికంటే ముందుగా తేజ సజ్జ  దాదాపుగా 20 కి పైగా చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించాడు.అయితే ఇందులో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన “ఇంద్ర” చిత్రంలో హీరో చిన్నప్పటి పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు.

ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో బాగానే రాణిస్తున్నాడు.

 Telugu Young Hero Teja Sajja Want To Remake Pawan Kalyan Tammudu Movie-తమ్ముడు మూవీని రీమేక్ చేయాలని ఉందంటున్న యంగ్ హీరో…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తాజాగా తేజ సజ్జ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా నెటిజన్లతో ముచ్చటించాడు.

ఇందులో భాగంగా పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు.అయితే ఇందులో ఓ నెటిజన్ మీకు పవన్ కళ్యాణ్ సినిమాలను రీమేక్ చేసే అవకాశం వస్తే ఏ సినిమాను రీమేక్ చేస్తారంటూ ప్రశ్నించాడు.

దీంతో తేజ సజ్జ ఈ విషయంపై స్పందిస్తూ తనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “తమ్ముడు” చిత్రాన్ని రీమేక్ చేయాలని ఉందని తెలిపాడు.అయితే మరో నెటిజన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఫోన్ నెంబర్ మరియు ఇంటి అడ్రస్ తెలియజేయాలని కోరాడు.

దీంతో తేజ సజ్జ తనదైన శైలిలో స్పందిస్తూ ఆధార్ కార్డు నెంబరు మరియు బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా అడగాల్సిందంటూ సరదాగా రిప్లై ఇచ్చాడు.

ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే తేజ సజ్జ జాంబి రెడ్డి అనే చిత్రంతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు.ఈ చిత్రం ప్రస్తుతం ప్రముఖ తెలుగు ఓటిటి అయిన ఆహా లో ప్రసారమవుతోంది.కాగా ప్రస్తుతం తేజ సజ్జ తెలుగులో ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న “ఇష్క్”  చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ చిత్రంలో తేజ సజ్జ కి జోడిగా తమిళ యంగ్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ గా నటిస్తోంది.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తయినప్పటికీ కరోనా వైరస్ కారణంగా సినిమా థియేటర్లు మూత పడటంతో ఈ చిత్రం విడుదలను కొంతకాలం పాటు వాయిదా వేశారు.

#Teja Sajja #Pawan Kalyan #TeluguYoung

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు