ఈ చిన్నప్పటి ఫోటోలో కనిపిస్తున్న తెలుగు హీరో ఎవరో గుర్తు పట్టండి చూద్దాం..!

తెలుగులో ప్రముఖ దర్శకుడు వైవియస్ చౌదరి దర్శకత్వం వహించిన  “దేవదాసు” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన “టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని” గురించి తెలుగు సినిమా పరిశ్రమలో తెలియని వారుండరు.అయితే వచ్చి రావడంతోనే హీరో రామ్ పోతినేని తన మొదటి చిత్రం దేవదాసు తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడంతో మాస్ అభిమానుల్లో బాగానే క్రేజ్ సంపాదించుకున్నాడు.

 Telugu Young Hero Ram Pothineni Childhood Photos Talk,  Ram Pothineni , Hero Ram-TeluguStop.com

 దీనికితోడు దేవదాసు చిత్రం తర్వాత  రామ్ నటించినటువంటి జగడం, రెడీ, మస్కా తదితర చిత్రాలు వెనువెంటనే హిట్టవడంతో మరింత ప్లస్ అయ్యింది.

అయితే తాజాగా ఈ మధ్య కాలంలో హీరో రామ్ పోతినేని సంబంధించినటువంటి ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 అయితే ఆ ఫోటోని ఒకసారి పరిశీలించినట్లయితే చిన్నప్పుడు రామ్ తలపాగా చుట్టుకొని తెల్లటి దుస్తులను ధరించి కర్ర చేతపట్టుకుని హీరో పోజు ఇస్తూ తీసుకున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ ఫోటో షేర్ చేసిన కొద్దికాలంలోనే లక్షల సంఖ్యలో లైకులు వచ్చాయి.

 అంతేగాక ఈ ఫోటోపై స్పందించిన అతడి అభిమానులు చిన్నప్పుడు రామ్ పోతినేని చాలా చలాకీగా కనిపిస్తున్నాడని అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో హీరో రామ్ పోతినేని “రెడ్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

 కాగా ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా నివేదా పేతురాజ్, అమృత అయ్యర్, మాళవిక శర్మ తదితరులు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తయినప్పటికీ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమా థియేటర్లు మూత పడటంతో కొంతకాలం పాటు ఈ చిత్రం విడుదలను తాత్కాలికంగా వాయిదా వేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube