ఈ హీరో కి టాలెంట్ ఉన్నా హిట్ లేక పోవడంతో...

ఒక్కోసారి చలన చిత్ర పరిశ్రమలో కొంతమంది హీరో హీరోయిన్లకు నటన పరంగా ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ అనుకోకుండా సినిమా అవకాశాలు లేకపోవడం, రాకపోవడం, వంటి కారణాల వల్ల గుర్తింపుకు నోచుకోలేక ఇబ్బందులు ఎదుర్కున్న నటీనటులు చాలామందే ఉన్నారు.అయితే 2012వ సంవత్సరంలో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తేజ తెరకెక్కించిన నీకు నాకు డాష్ డాష్ అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోగా పరిచయమైన యంగ్ హీరో ప్రిన్స్ కూడా ఈ కోవకే చెందుతాడు.

 Telugu Young Hero Prince Career In Struggles, Telugu Young Hero, Prince, Bus Sto-TeluguStop.com

ఈ చిత్రం ఆశించిన స్థాయిలో హిట్ కాకపోయినప్పటికీ ప్రిన్స్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

అయితే మొదట్లో ప్రిన్స్ తెలుగులో బస్ స్టాప్, రొమాన్స్, తదితర చిత్రాలతో బాగానే ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు.

దీంతో వరుస సినిమా అవకాశాలతో కెరియర్ సాఫీగా సాగిపోతున్న సమయంలో కథల పట్ల కొంతమేర అవగాహన లోపించడంతో పలు డిజాస్టర్లను ఎదుర్కొన్నాడు.అంతే కాకుండా ఆ మధ్య ప్రిన్స్   హీరోగా నటించిన మనసును మాయ సేయకే, డాలర్స్ కాలనీ, బన్నీ అండ్ చెర్రీ, తదితర చిత్రాలు కనీసం విడుదలైనట్లు కూడా చాలా మంది ప్రేక్షకులకు తెలియదు.

దీంతో ఈ ప్రభావం ప్రిన్స్ సినిమా కెరియర్ పై పడటంతో కొంతమేర కష్టాల్లో పడింది.కాగా ఆ మధ్య టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజ” చిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలో కనిపించినప్పటికీ ప్రిన్స్ కి పెద్దగా కలిసి రాలేదు.

Telugu Bus, Prince, Princecareer, Telugu Young, Teluguyoung, Tollywood-Movie

అలాగే 2017 సంవత్సరంలో బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో లో కంటెస్టెంట్ గా పాల్గొన్నప్పటికీ ఆ ఫేమ్ కూడా పెద్దగా కలిసి రాలేదు.దీంతో ప్రిన్స్ కొంత మేర సినిమా అవకాశాల కోసం బాగానే శ్రమిస్తున్నాడు.అయితే ఇప్పటికైనా ప్రిన్స్ సరైన కథలను ఎంచుకుని ఒక్క హిట్ పడితే మళ్లీ తన సినీ కెరీర్ గాడిలో పడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.కాగా ఇటీవలే ప్రిన్స్ “పవర్ ప్లే” అనే చిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలో నటించాడు.

కానీ ఈ చిత్రం కూడా డిజాస్టర్ గా నిలిచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube