ఈ చిన్నప్పటి ఫొటోలో కనిపిస్తున్న హీరో ఎవరో గుర్తు పట్టండి చూద్దాం...?

2002వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వం వహించిన “జయం” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన టాలీవుడ్ యంగ్ హీరో “నితిన్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే నితిన్ వచ్చీరావడంతోనే తన మొదటి చిత్రంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఏకంగా “ఫిలిం ఫేర్” అవార్డు కూడా దక్కించుకున్నాడు.

 Telugu Young Hero Nithin Shared Childhood Memory With Her Mother, Telugu Young H-TeluguStop.com

ఆ తర్వాత నితిన్ హీరోగా నటించిన దిల్, సై తదితర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బాగానే అలరించాయి.కానీ ఆ తరువాత కథల పట్ల కొంత మేర సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో మధ్యలో పలు డిజాస్టర్లను ఎదుర్కొన్నప్పటికీ వరుసగా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మాత్రం బాగానే ఆకట్టుకుంటున్నాడు.

అయితే హీరో నితిన్ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఆ మధ్య నితిన్ తల్లి పుట్టిన రోజు కావడంతో చిన్నప్పుడు తన తల్లితో కలిసి దిగిన ఫోటోని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేశాడు.

అంతేగాక తన తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తన తల్లిని ఎంతగానో ప్రేమిస్తున్నానని అంతేకాకుండా ఓపిక మరియు అర్థం చేసుకునేటువంటి వాటికి ధన్యవాదాలు తెలిపాడు.దీంతో ప్రస్తుతం హీరో నితిన్ చిన్నప్పుడు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

అంతే కాకుండా ఈ ఫోటోని షేర్ చేసిన కొద్ది సమయంలోనే దాదాపుగా రెండు లక్షల పైచిలుకు లైకులు కామెంట్లు వచ్చాయి.

ఈ విషయం ఇలా ఉండగా నితిన్ ఇటీవల తెలుగులో “చెక్ మరియు రంగ్ దే” అనే చిత్రాలలో హీరోగా నటించాడు.అయితే ఇందులో రంగ్ దే చిత్రం బాక్సాఫీస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ చెక్ మాత్రం డిజాస్టర్గా నిలిచింది.దీంతో తన తదుపరి చిత్ర కథల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు.

కాగా ప్రస్తుతం నితిన్ తెలుగులో ప్రముఖ దర్శకుడు “మేర్లపాక గాంధీ” దర్శకత్వంలో తెరకెక్కుతున్న “మాస్ట్రో” చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube