శభాష్ : కరోనా సమయంలో ఆసుపత్రుల వివరాలు షేర్ చేస్తూ హెల్ప్ చేస్తున్న యంగ్ హీరో...

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కోరలు చేస్తుండడంతో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.పలువురు సెలబ్రిటీలు కూడా ఈ కరోనా వైరస్ మహమ్మారి అరికట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలలో సహాయం చేస్తూ ప్రజలకి అవగాహన కల్పిస్తున్నారు.

 Telugu Young Hero Nandu Sharing Hospital Details And Helping People-TeluguStop.com

అంతేకాకుండా ఈ కరోనా విపత్కర సమయంలో ఎవరికైనా ఏదైనా సహాయం కావాలని సోషల్ మీడియా మాధ్యమాలలో కోరితే కొంత మంది సెలబ్రెటీలు స్పందిస్తూ వారికి తోచిన సహాయం చేస్తున్నారు.

కాగా తెలుగు యంగ్ హీరో నందు కూడా సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ కరోనా సహాయాలపై బాగానే స్పందిస్తున్నాడు.

 Telugu Young Hero Nandu Sharing Hospital Details And Helping People-శభాష్ : కరోనా సమయంలో ఆసుపత్రుల వివరాలు షేర్ చేస్తూ హెల్ప్ చేస్తున్న యంగ్ హీరో…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా ఇటీవలే తనకు తెలిసిన ఓ ఆసుపత్రిలో పడకలు ఖాళీగా ఉన్నాయని ఎవరికైనా కావాలంటే తనకు మెసేజ్ చేయాలని సూచించాడు.దీంతో కొందరు తమకు సహాయం చేయాలని కోరగా వెంటనే వారికి ఆస్పత్రి వివరాలను షేర్ చేశాడు.

అంతేకాకుండా ఎవరికైనా అత్యవసరంగా రక్తం లేదా ప్లాస్మా కావాలని మెసేజ్ చేసిన వెంటనే స్పందింస్తున్నాడు.జీవితం అనేది చాలా చిన్నదని ఇలాంటి చిన్న జీవితంలో గొడవలు, మనస్పర్ధలు, విభేదాలు వంటి వాటికి తావు లేకుండా సంతోషంగా జీవించాలని కూడా నందు తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపాడు.

దీంతో యంగ్ హీరో నందు చేసినటువంటి ఈ పనికి నెటిజన్లు అభినందనలు తెలియజేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా గత ఏడాది నందు సవారి అనే చిత్రంలో హీరోగా నటించాడు.

ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది.దీంతో ప్రస్తుతం “బొమ్మ బ్లాక్ బస్టర్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ చిత్రంలో నందు కి జోడి గా టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ మరియు యాంకర్ రష్మి గౌతమ్ హీరోయిన్ గా నటిస్తోంది.కాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్టు సమాచారం.

కానీ ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా కొంత కాలం పాటు షూటింగ్ పనులను తాత్కాలికంగా నిలిపి వేసినట్లు తెలుస్తోంది.

కరోనా గమనిక : బయటికి వెళ్లే సమయంలో మాస్కు తప్పకుండా ధరించండి.అలాగే నిత్యం చేతులను శానిటైజర్ తో శుభ్రంగా కడుక్కోండి.మీతో పాటూ మీ కుటుంభ సభ్యులను  కూడా సురక్షితంగా ఉంచండి.తెలుగుస్టాప్.కామ్ యాజమాన్యం

.

#Nandu #Corona Virus #NanduHelping #TeluguYoung

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు