ఆ లిప్ లాక్ సీన్ ని తీసెయ్యమని నిర్మాతని వేడుకున్నా... అయినా కానీ...   

తెలుగులో నూతన దర్శకుడు జక్కా హరి ప్రసాద్ దర్శకత్వం వహించిన “దర్శకుడు” అనే చిత్రం ద్వారా నటిగా తెలుగు సినిమా పరిశ్రమకు నటిగా పరిచయమైన యంగ్ బ్యూటీ “పూజిత పొన్నాడ” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు తన మొదటి చిత్రం తో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోయినప్పటికీ తన తదుపరి చిత్రం “రంగస్థలం” తో ప్రేక్షకులని బాగానే అలరించింది.

TeluguStop.com - Telugu Young Beauty Poojitha Ponnada React About Her Lip Kiss Scene Ion Where Is The Venkata Lakshmi

దీంతో వరుస సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చినప్పటికీ హీరోయిన్ గా మాత్రం ఎందుకో నిలదొక్కుకోలేక పోయింది.తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పూజిత పొన్నాడ పాల్గొని ఇందులో భాగంగా తాను నటించిన “వేర్ ఇస్ ద వెంకటలక్ష్మి” అనే చిత్రం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

అయితే ఈ చిత్రంలో తాను గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలో నటించినప్పటికీ ఒక పాటలో కూడా కనిపించానని కానీ ఆ పాటలో  ఓ ముద్దు సన్నివేశంలో నటించడంతో చిత్ర యూనిట్ సభ్యులు కేవలం ఆ ముద్దు సన్నివేశాన్ని మాత్రమే హైలెట్ చేస్తూ చూపించారని చెప్పుకొచ్చింది. అంతేగాక అనవసరం అయినటువంటి సన్నివేశాలను ఉంచి తన నటనకు మంచి స్కోప్ ఉన్నటువంటి సన్నివేశాలను డిలీట్ చేశారని దాంతో ఈ విషయంపై నిర్మాతను అడిగినప్పటికీ పలు సాకులు చెప్పి తప్పించుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసింది.

TeluguStop.com - ఆ లిప్ లాక్ సీన్ ని తీసెయ్యమని నిర్మాతని వేడుకున్నా… అయినా కానీ… -Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అలాగే మనం ఒక సినిమాలో నటించేటప్పుడు స్టోరీ, రెమ్మ్యూనరేషన్ మాత్రమే ముఖ్యం కాదని మనం పని చేసినటువంటి టీం కూడా చాలా ముఖ్యమని చెప్పుకొచ్చింది. మరోమారు ఇలాంటి చిత్ర యూనిట్ సభ్యులతో నటించే అవకాశం వస్తే కచ్చితంగా నటించనని నిర్మొహమాటంగా చెప్పేసింది. దీంతో పూజిత పొన్నాడ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే పూజిత పొన్నాడ “రన్” అనే ఓ తెలుగు వెబ్ సిరీస్ లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.

 ఈ వెబ్ సిరీస్ కి తెలుగు నూతన దర్శకుడు లక్ష్మీకాంథ్ దర్శకత్వం వహించాడు. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం ప్రముఖ తెలుగు ఓటిటి ఆహా లో ప్రసారమవుతోంది.  కాగా ఇటీవలే పూజిత పొన్నాడ టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన “మిస్ ఇండియా” అనే చిత్రంలో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది. ప్రస్తుతం సినిమా థియేటర్లు మూత పడటంతో ఈ చిత్రాన్ని కూడా  నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేశారు.

#TeluguYoung #PoojithaPonnada #WhereIs #Rangasthalam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు