ఆ స్టార్ హీరో తమ్ముడితో నటించేందుకు బేబమ్మ ఒప్పుకోలేదట...

ఈ ఏడాది టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించిన ఉప్పెన చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన యంగ్ హీరోయిన్ “కృతి శెట్టి” ప్రస్తుతం తిరుగులేని ఫామ్ తో దూసుకుపోతోంది.దీంతో ఈ అమ్మడికి వరుసగా సినిమా అవకాశాలు క్యూ కట్టాయి.

 Telugu Young Actress Kriti Shetty Reject Film Producer Son Movie Offer-TeluguStop.com

కాగా ఇప్పటికే తెలుగులో నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ మరియు యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న మరో చిత్రంతో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది.అయితే మొదటి సినిమాకి ఈ అమ్మడు 20 లక్షల రూపాయలకు పైగా రెమ్మ్యూనరేషన్ తీసుకుంది.

కానీ తన తదుపరి రెండు చిత్రాల కోసం దాదాపుగా కోటి రూపాయలకు పైగా రెమ్మ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

 Telugu Young Actress Kriti Shetty Reject Film Producer Son Movie Offer-ఆ స్టార్ హీరో తమ్ముడితో నటించేందుకు బేబమ్మ ఒప్పుకోలేదట…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తాజాగా ఈ అమ్మడి గురించి మరో వార్త సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

ఇంతకీ ఆ వార్త ఏమిటంటే ఇటీవలే ఓ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంలో నటించేందుకు కృతి శెట్టి నిరాకరించినట్లు కొందరు చర్చించుకుంటున్నారు.అయితే ఆ చిత్రంలో హీరోగా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరో తమ్ముడు మరియు సినీనిర్మాత కొడుకు నటిస్తున్నట్లు సమాచారం.

అయితే ఆ హీరోకి ఇదే మొదటి చిత్రం కావడంతో కొంతమేర కృతి శెట్టి అతడితో నటించేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది.దీంతో బేబమ్మ రెజెక్ట్ చేసినటువంటి ఈ ఆఫర్ టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజతో హీరోయిన్ గా నటించి ఎంట్రీ ఇచ్చినటువంటి “మాళవిక శర్మ” ని వరించినట్లు టాలీవుడ్ టౌన్ సమాచారం.

కానీ ఇప్పటి వరకు ఈ విషయంపై   చిత్ర యూనిట్ సభ్యులు గాని దర్శకుడిగాని అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో సినిమా షూటింగులను నిలిపివేశారు.

దీంతో కృతి శెట్టి ఇంటిపట్టునే ఉంటూ సేవలను బాగానే ఎంజాయ్ చేస్తోంది.ఏదేమైనప్పటికీ వచ్చి రావడంతో కృతి శెట్టి మంచి హిట్ ని అందుకోవడంతో ఈ అమ్మడి సినీ కెరియర్ దాదాపుగా సెట్ అయినట్లే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

#TeluguYoung #TeluguYoung #ProducerSon #Kriti Shetty

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు