కలిసి నటించినంత మాత్రాన పెళ్లి చేసుకోబోతున్నట్లు ఎలా అనుకుంటారు....

ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలు అందరికీ అందుబాటులోకి రావడంతో నూతన నటీనటులకు సినీ అవకాశాలు దక్కించుకోవడంలో బాగానే తోడ్పడుతున్నాయి. అయితే ఇందులో ముందుగా కొందరు యూట్యూబ్లోని షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఫేమ్ సంపాదించి తర్వాత సినీ పరిశ్రమలో మెల్లమెల్లగా అవకాశాలను కూడా దక్కించుకున్నారు.

 Telugu Young Actress Gnaneswari React About Her Marriage With Pradeep Machiraju-TeluguStop.com

 అయితే టాలీవుడ్ యంగ్ హీరోయిన్ జ్ఞానేశ్వరి కూడా ఈ కోవకే చెందుతుంది.ఈమె మొదట్లో షార్ట్ ఫిలిమ్స్ లో నటించి ఆ తరువాత తెలుగు లో ప్రసారమయ్యే పెళ్లిచూపులు- 2 షోలో పాల్గొని విజేతగా నిలిచింది.

అయితే తాజాగా హీరోయిన్ జ్ఞానేశ్వరి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని  తాను కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి పెళ్లి చూపులు -2 షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించిన యాంకర్ ప్రదీప్ కి మరియు తనకి మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు అంతేకాక తొందరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు వినిపిస్తున్న  వార్తలపై  స్పందించింది.ఇందులో భాగంగా యాంకర్ ప్రదీప్ సౌత్ ఇండియా లోనే మంచి ఫేమ్ ఉన్నటువంటి యాంకర్ అని దాంతో కొందరు అతని పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేందుకు ఇలాంటి వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది.

తాను కేవలం పెళ్లిచూపులు షో లో కంటెస్టెంట్ గా పాల్గొన్నానని అంతే తప్ప తనకు ప్రదీప్ మాచిరాజు కి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.అంతేగాక ఈ మధ్యకాలంలో కొందరికి నిజానిజాలు తెలుసుకోకుండా కామెంట్లు చేయడం సరదా అయిందని అలా చేయడం వల్ల సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితంలో పలు ఇబ్బందులను ఎదుర్కొంటారని కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేసేముందు ఒకసారి ఆలోచించాలని అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో జ్ఞానేశ్వరి నటించినటువంటి  పిఎస్ : పీకే, మిస్టర్ అండ్ మిసెస్, తను,  ఒక లవ్ జంట,  తదితర షార్ట్ ఫిలిం చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.కాగా ప్రస్తుతం మరో రెండు తెలుగు చిత్రాలలో జ్ఞానేశ్వరి హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube