తెలుగులో ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించిన “వేదం” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన హీరోయిన్ దీక్షా సేథ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే మంచి ఫేమస్ డైరెక్టర్ మరియు స్టార్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చినటువంటి చిత్రంతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోక పోవడంతో ఈ అమ్మడుకి గుర్తింపు రాలేదు.
కానీ సినీ అవకాశాలు మాత్రం బాగానే తలుపు తట్టాయి.
ఈ క్రమంలో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించినటువంటి మిరపకాయ్ చిత్రంలో రెండో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది.
అయితే ఈ చిత్రం హిట్ అయినప్పటికీ ఈ అమ్మడుకి మాత్రం కలిసి రాలేదు.ఆ తర్వాత తెలుగులో టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా నటించినటువంటి వాంటెడ్ అనే చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించింది.
అయితే ఈ చిత్రం పర్వాలేదనిపించడంతో తెలుగులో కాకుండా తమిళం లో హీరోయిన్ గా నటించే అవకాశాలు దక్కించుకుంది.
అయితే అక్కడ కొంత కాలం పాటు హీరోయిన్ గా బాగానే రాణించినప్పటికీ ఈ అమ్మడు నటించిన ఎక్కువ శాతం చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి.
దీంతో ప్రస్తుతం అక్కడ కూడా సినీ అవకాశాలు లేక తన ఉనికిని చాటుకునేందుకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది.అయితే ఏమైందో ఏమో కానీ ఈ మధ్య దీక్ష సేథ్ సినీ ఫంక్షన్స్ లోగాని లేదా మరే ఇతర కార్యాల్లో కూడా అస్సలు కనిపించడం లేదు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా నటి దీక్షా సేథ్ హీరోయిన్ గానే కాకుండా పలు చిత్రాలకు సహ నిర్మాతగా కూడా వ్యవహరించింది.