సినిమా అవకాశాలు లేనప్పుడు రోడ్ల మీద పుస్తకాలు కూడా అమ్మాను... కానీ..

తెలుగులో మాస్ మహారాజా రవితేజ హీరోగా “డిస్కో రాజా” చిత్రంలో నటించిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు వి.

 Telugu Villain Bobby Simha About His Struggles Before Entry To The Film Industry-TeluguStop.com

ఐ.ఆనంద్ దర్శకత్వం వహించగా హీరోయిన్లుగా నభా నటేష్ మరియు పాయల్ రాజ్ పుత్ లు నటించారు.కాగా తమిళ ప్రముఖ నటుడు బాబీ సింహ మరియు టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ మరియు హీరో సునీల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించారు.అయితే తాజాగా బాబీ సింహ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ ప్రయాణంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి ప్రేక్షకులతో పెంచుకున్నాడు.

ఇందులో భాగంగా మొదటగా తాను హైదరాబాదులో పుట్టానని తెలిపాడు.అయితే ఇక్కడ మూడవ తరగతి వరకు చదువుకున్న తర్వాత తన కుటుంబ సభ్యులు కోడైకెనాల్ కి మారిపోయారని దాంతో అక్కడే  తన చదువుని కొనసాగించానని చెప్పుకొచ్చాడు.

ఆ తర్వాత సినిమా అవకాశాల కోసం చెన్నై కి వచ్చానని ఈ క్రమంలో ఖర్చుల  కోసం పలు ఉద్యోగాలు కూడా చేశానని తెలిపాడు.ఇందులో ముఖ్యంగా కార్ ఇన్సూరెన్స్ మరియు ట్రావెలింగ్ ఇన్సూరెన్స్ కంపెనీలలో కొంతకాలం అలాగే  ఇంకొంతకాలం పాటు రోడ్లపై పుస్తకాలు కూడా అమ్మానని చెప్పుకొచ్చాడు.

Telugu Bobby Simha, Bobbysimha, Kollywood, Telugu Villain, Teluguvillain, Tollyw

ఆ తర్వాత దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు పరిచయం కావడంతో షార్ట్ ఫిలిమ్స్ లో నటించే అవకాశాలు వచ్చాయని అలా తన సినీ కెరీర్ మొదలైందని తెలిపాడు.అయితే స్వతహాగా తాను తెలుగు రాష్ట్రాలకు చెందిన వాడినని కానీ చిన్నప్పుడే తన తల్లిదండ్రులు కొడైకెనాల్ కి వెళ్లిపోవడంతో ఇక్కడ తనకు ఎవరూ తెలియదని అందువల్లనే తెలుగు సినిమా పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నించలేదని కూడా తెలిపాడు.

అయితే ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో బిజీ బిజీగా గడుపుతున్నానని అలాగే తన తల్లిదండ్రులకి తన స్టార్ డమ్ మరియు సినిమాల గురించి తెలియదని అలాగే తాను కూడా పెద్దగా తన వృత్తి పరంగా తన తల్లిదండ్రులతో చర్చించనని తెలిపాడు.   ఇక నుంచి తాను తెలుగు, తమిళ, భాషలలో తన పాత్రకి ప్రాధాన్యత ఉన్న అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తానని చెప్పుకొచ్చాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం బాబీ సింహ తెలుగు, తమిళ, మలయాళ, తదితర భాషలలో కలిపి దాదాపుగా నాలుగు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తున్నాడు.

ఇందులో ముఖ్యంగా ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఇండియన్ – 2 చిత్రంలో కూడా బాబీ సింహ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.

దీంతో బాబీ సింహ తెలుగు సినిమాలపై దృష్టి సారించి కథల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే టాలీవుడ్ కి మరో విజయ్ సేతుపతి దొరికినట్లేనని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube