ఒకప్పుడు ప్రేక్షకులని ఎంతగానో భయపెట్టిన ఈ విలన్ ప్రస్తుతం అవకాశాలు లేక...- Telugu Villain Anand Raj Real Life And Movie Offers News

Telugu villain Anand Raj Real life and Movie offers news, Anand Raj, Telugu villain, Tollywood, Movie Offers, Anand Raj Family News, - Telugu Anand Raj, Anand Raj Family News, Movie Offers, Telugu Villain, Telugu Villain Anand Raj Real Life And Movie Offers News, Tollywood

ఒకప్పుడు టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, వెంకటేష్, కింగ్ నాగార్జున తదితర స్టార్ హీరోల సినిమాల్లో విలన్ పాత్ర పోషించి తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న తమిళ నటుడు ఆనంద్ రాజ్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నటుడు ఆనంద్ రాజ్ వందలకి పైగా చిత్రాల్లో విలన్ గా నటించడమే కాకుండా పదికి పైగా చిత్రాల్లో కొంతమేర మెయిన్ లీడ్ పాత్రలలో కూడా నటించి సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు.

 Telugu Villain Anand Raj Real Life And Movie Offers News-TeluguStop.com

తెలుగులో మొదటగా ఆనంద్ రాజ్ ప్రముఖ సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన “ముద్దుల మావయ్య” అనే చిత్రంలో విలన్ గా నటించి టాలీవుడ్ సినిమా పరిశ్రమకి విలన్ గా పరిచయం అయ్యాడు.ఆ తర్వాత లంకేశ్వరుడు, ఒంటరి పోరాటం, గ్యాంగ్ లీడర్, పెదరాయుడు, భాషా, తదితర చిత్రాలలో విలన్ గా నటించి తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో కట్టి పడేసాడు.

ఒకప్పుడు వరుస సినిమా అవకాశాలతో సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఆనంద్ రాజ్ ప్రస్తుతం కమెడియన్ పాత్రలకి పరిమితమయ్యాడు.ఇటీవలే  జాక్ పాట్ చిత్రంలో కొంతమేర కామెడీ రోల్ ని పోషించిన ఆనంద్ రాజ్ బెస్ట్ కమెడియన్ అవార్డును కూడా అందుకున్నాడు.

 Telugu Villain Anand Raj Real Life And Movie Offers News-ఒకప్పుడు ప్రేక్షకులని ఎంతగానో భయపెట్టిన ఈ విలన్ ప్రస్తుతం అవకాశాలు లేక…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ మద్య తమిళ ప్రముఖ హీరో విజయ్ హీరోగా నటించినటువంటి విజిల్ చిత్రంలో కనిపించాడు.

అయితే 1998లో ఆనంద్ రాజ్ సినీ ప్రస్థానం మొదలైంది.

ఈ క్రమంలో దాదాపుగా 300కు పైగా చిత్రాల్లో విలన్ పాత్రలను పోషించి పలు అవార్డులను కూడా అందుకున్నాడు.అయితే ప్రస్తుతం ఆనంద రాజ్ తన కూతురిని నటిగా సినిమా పరిశ్రమకు పరిచయం చేసేందుకు గాను సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

#Anand Raj #TeluguVillain #AnandRaj

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు