పవన్ కళ్యాణ్ అప్పట్లో వాటికి చాలా దూరంగా ఉండేవాడు... దాంతో...

తెలుగులో ఒకప్పుడు దాదాపుగా 50 కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి దర్శకత్వ విభాగంలో జాతీయ, రాష్ట్రీయ అవార్డులను అందుకని ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ సీనియర్ దర్శకుడు “ముత్యాల సుబ్బయ్య” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే దర్శకుడు ముత్యాల సుబ్బయ్య అప్పట్లో చాలా మంది యంగ్ హీరోలను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.

 Telugu Vetran Director Muthyala Subbaiah Sensational Comments On Pawan Kalyan-TeluguStop.com

అంతేకాకుండా నందమూరి బాలకృష్ణ, వెంకటేష్, కింగ్ నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ తదితర స్టార్ హీరోల చిత్రాలకు దర్శకత్వం వహించి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సాధించాడు.అయితే ఈ మధ్య వయసు మీద పడటంతో దర్శకుడు ముత్యాల సుబ్బయ్య గత కొద్ది కాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు.

కాగా తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో దర్శకుడు ముత్యాల సుబ్బయ్య పాల్గొని పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

 Telugu Vetran Director Muthyala Subbaiah Sensational Comments On Pawan Kalyan-పవన్ కళ్యాణ్ అప్పట్లో వాటికి చాలా దూరంగా ఉండేవాడు… దాంతో…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇందులో అప్పట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “గోకులంలో సీత” చిత్రానికి దర్శకత్వం వహించానని తెలిపాడు.

అయితే ఆ చిత్రం తమిళ చిత్రం నుంచి అనువాదం చేసినప్పటికీ చాలా మార్పులు, చేర్పులు చేశామని చెప్పుకొచ్చాడు.అయితే ఈ చిత్రం తెరకెక్కించిన సమయంలో పవన్ కళ్యాణ్ గురించి పలు ఆసక్తికర విషయాలను గమనించానని తెలిపాడు.

అయితే పవన్ కళ్యాణ్ మితభాషి అయినప్పటికీ కొత్త కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఎప్పుడూ ముందు ఉంటాడని చెప్పుకొచ్చాడు.అంతేకాక గోకులంలో సీత చిత్ర షూటింగ్ పనులు పూర్తయిన తర్వాత సరిగ్గా పబ్లిసిటీ చేయలేకపోయామని, అలాగే పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరోగా నటించడానికి ఎప్పుడూ ముందు ఉంటాడని, కానీ పబ్లిసిటీ విషయంలో మాత్రం చాలా వెనుక ఉంటాడని అందువల్లనే గోకులంలో సీత ప్రమోషన్స్ చేయలేకపోయామని తెలిపాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో వరుస సినిమా అవకాశాలతో దూసుకు పోతున్నాడు.ఇటీవలే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “వకీల్ సాబ్” చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడమేగాక దర్శక నిర్మాతలకు కాసుల పంట పండించింది.కాగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తెలుగులో “హరిహర వీరమల్లు” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జోడి గా “జాక్వెలిన్ ఫెర్నాండేజ్” బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ గా నటిస్తుండగా తెలుగు ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు.

#Pawan Kalyan #TeluguVeteran #Gokulamlo Sitha #TeluguVeteran

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు