అందుకే అలాంటి యూట్యూబ్ ఛానెల్స్ అంటే అసహ్యం ...

ఈ మధ్యకాలంలో కొందరు సెలబ్రిటీలు మరియు రాజకీయ నాయకులు చెప్పినటువంటి మాటలని కొందరు వక్రీకరించి వ్రాయడం మరియు యూట్యూబ్లో అసభ్యకరంగా థంబ్ నెయిల్స్ క్రియేట్ చేయడం వంటివి చేయడంతో కొందరు సినీ సెలబ్రిటీలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.కాగా తాజాగా టాలీవుడ్ ప్రముఖ సింగర్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.

 Telugu Veteran Music Director Rp Patnaik Serious On Youtube Channels Thumbnail,-TeluguStop.com

పి.పట్నాయక్ కూడా ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ఇంతకీ విషయం ఏమిటంటే ఇటీవలే రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితుల గురించి స్పందిస్తూ సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ యూట్యూబ్ లో ఓ వీడియోని విడుదల చేశాడు.అయితే ఈ వీడియోలోని మాటలని కొంతమంది వక్రీకరిస్తూ తాను చెప్పిన మాటలను కాకుండా వేరే ఇతర మాటలను జోడిస్తూ థంబ్ నెయిల్స్ క్రియేట్ చేసి యూట్యూబ్ లో వీడియోలను పోస్ట్ చేశారు.

దీంతో ఈ విషయంపై స్పందించిన ఆర్.పి.పట్నాయక్ తాను చెప్పిన మాటలను వక్రీకరించి కొంతమంది అసభ్యకరంగా వీడియోలను పోస్ట్ చేస్తున్నారని ఇది సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాకుండా ఇలాంటి వాటి వల్లే తాను ఇప్పటివరకు యూట్యూబ్ ఛానళ్ళ ఇంటర్వ్యూలకు దూరంగా ఉంటున్నానని కూడా స్పష్టం చేశాడు.

అంతే కాకుండా తాను చెప్పనటువంటిమాటలు కూడా చెప్పినట్లు వక్రీకరించి తన గురించి అసభ్యకర ప్రచారాలు చేసేటువంటి వారిని చూస్తే అసహ్యం వేస్తుందని మరోమారు ఇలాంటివి జరిగితే బాగోదని కూడా హెచ్చరించాడు.అంతేకాక వ్యూస్ మరియు టీఆర్పీల కోసం సినీ సెలబ్రిటీల మనోభావాలను మరియు వారి యొక్క వ్యక్తిగత జీవితాలలోకి చొరబడే ప్రయత్నం చేయొద్దని కూడా హెచ్చరించాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా గతంలో టాలీవుడ్ హీరో నాగార్జున హీరోగా నటించిన “నేనున్నాను” అనే చిత్రం సమయంలో జరిగినటువంటి ఓ సంఘటన కారణంగా ఆర్.పి.పట్నాయక్ పూర్తిగా సంగీతం అందించడం పూర్తిగా మానేశాడు.ఇక అప్పటి నుంచి ఇతర వ్యాపారాలపై దృష్టి సారించినట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube