ఆ సినిమా వల్లే నేను మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేయడం మానేసాను...  

తెలుగులో మనసంతా నువ్వే, జయం, నువ్వు నేను,  నువ్వు లేక నేను,  సంబరం,  తదితర సూపర్ హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించినటువంటి టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఎన్నో ఫ్యామిలీ ఓరియంటెడ్ మెలోడీస్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఆర్.పి.పట్నాయక్ ఉన్నట్లుండి సంగీత దర్శకుడిగా పని చేయడం మానేశాడు.దీంతో ఒక్కసారిగా ఆర్.పి.పట్నాయక్ గురించి పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో మరియు సినిమా పరిశ్రమలో హల్ చల్ చేస్తున్నాయి.కాగా తాజాగా ఆర్.పి.పట్నాయక్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తాను మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేయకపోవడానికి గల కారణాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

TeluguStop.com - Telugu Veteran Music Director Rp Patnaik React About To Stop His Music Career In Film Industry

ఇందులో భాగంగా తాను తెలుగులో టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా నటిస్తున్న “నేనున్నాను” చిత్రానికి సంగీత దర్శకుడిగా పని చేస్తున్న సమయంలో ఆ చిత్రానికి సంబంధించిన ఓ వ్యక్తి వచ్చి మాట్లాడుతున్న సమయంలో అనుకోకుండా ఆ వ్యక్తి మీరు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేయడం వల్ల సినిమాకి పెద్దగా బిజినెస్ కావడం లేదని అనడంతో తాను ఒక్కసారిగా ఆలోచనలో పడ్డానని తెలిపాడు.అంతేకాక అతడు అన్నటువంటి ఆ మాట తనని ఎంతగానో ఆలోచింపచేసిందని దాంతో తన వల్ల ఓ సినీ నిర్మాత నష్టపోవడం ఇష్టంలేక తానే మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగకూడదని నిర్ణయించుకున్నానని తెలిపాడు.

దీంతో కొందరు అసలు విషయం తెలియక ఈ చిత్రం లో హీరోగా నటిస్తున్న నాగార్జున వల్లే తాను మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేయడం లేదని కొందరు తన గురించి లేనిపోని ప్రచారాలు చేశారని అందులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసాడు. అంతేగాక ఇప్పటికీ నాగార్జున తనతో ఎంతో సన్నిహితంగా ఉంటారని అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం సరి కాదని అన్నారు.

TeluguStop.com - ఆ సినిమా వల్లే నేను మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేయడం మానేసాను…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఆర్.పి.పట్నాయక్ తెలుగు, తమిళం, కన్నడ,  హిందీ తదితర భాషలలో కలిపి దాదాపుగా  50 కి పైగా చిత్రాలకి సంగీత దర్శకుడిగా పని చేశారు.అంతేగాక మరో నాలుగు చిత్రాలకి సినీ దర్శకుడిగా పని చేస్తూ ఈ చిత్రాలలో కీలక పాత్రలలో నటించారు.

#RPPatnaik #TeluguMusic #RP Patnaik #TeluguVeteran #RPPatnaik

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు