ఆ రోజు నేను ఆ హోటల్ గదిలో లేను... కానీ కొంతమంది కావాలని ...

ఒక్కోసారి వేరే వాళ్ళు చేసినటువంటి పనుల కారణంగా ఇంకొకరు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటారు.అప్పట్లో పలు తెలుగు చిత్రాల్లో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న “సీనియర్ నటి యమున” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

 Telugu Veteran Heroine Yamuna Gives Clarity About Hotel Issue-TeluguStop.com

 అయితే నటి యమున గురించి ఆ మధ్య కాలంలో అనుకోకుండా వ్యభిచారం నిర్వహిస్తూ హోటల్ గదిలో పోలీసులకు పట్టుబడినట్లు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో బలంగా వినిపించాయి.

దాంతో ఈ ప్రభావం యమున సినీ కెరీర్ పై పడింది.

అంతేగాక యమునకి పలు సినిమా అవకాశాలు కూడా దూరం అయ్యాయి.దీంతో అప్పటి నుంచి కొంత మేర యమునా సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటుంది.

 అయితే తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో నటి యమున పాల్గొని తనపై వచ్చినటువంటి ఈ పుకార్ల పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.ఇందులో భాగంగా కొందరు తనను కావాలనే ఈ కేసులో ఇరికించారని దాంతో తనకు తానే పోలీస్ స్టేషన్ కి వెళ్లి వివరణ ఇచ్చి ముందస్తు బెయిల్ ద్వారా అరెస్టు కాకుండా బయటకు వచ్చానని చెప్పుకొచ్చింది అంతేగాక తనకు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదని పోలీసులు విచారణలో నిరూపించానని కూడా స్పష్టం చేసింది.

అయితే తాను ఈ కేసులో ఇరుక్కున్న అనంతరం తన కుటుంబ సభ్యులు తనకు అండగా నిలిచారని, అలాగే తనపై నమ్మకం ఉంచి తన ప్రమేయం లేకుండా ఇరుక్కున్న ఈ కేసు నుంచి బయట పడేందుకు ఎంతగానో సహాయ పడ్డారని చెప్పుకొచ్చింది.తన సినీ జీవితంలో ఇంకొకరు చేసినటువంటి తప్పులకు తాను బలయ్యానని అంతేగాక తన సినీ కెరీర్ కూడా దెబ్బతిందని ఎమోషనల్ అయ్యింది.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube