ఈ వెటరన్ హీరోయిన్ చెల్లెలు కూడా హీరోయిన్ గా నటించింది... కానీ...

తెలుగులో ఒకప్పుడు కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్, తదితర స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను బాగా అలరించిన ప్రముఖ హీరోయిన్ “టబు” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే మొదటిగా నటి టబు తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన “కూలి నెంబర్ వన్” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైంది.

 Telugu Veteran Heroine Tabu Sister Farah Naaz Hashmi News, Tabu, Farah Naaz Hash-TeluguStop.com

దీంతో వచ్చీరావడంతోనే మంచి హిట్ అందుకోవడంతో ఈ అమ్మడికి సినిమా అవకాశాలు బాగానే క్యూ కట్టాయి.దీంతో ఒకానొక సమయంలో బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, అంటూ వరస సినిమా ఆఫర్లతో బిజీబిజీగా గడిపింది.

అయితే నటి టబు పూర్తి పేరు తబస్సమ్ ఫాతిమా హష్మీ.కాగా నటి టబు సోదరి కూడా హీరోయిన్ అని ఇప్పటికీ చాలా మందికి తెలియదు.అయితే టబు చెల్లెలు పేరు ఫరహ్ నాజ్ హష్మీ.ఈమె తెలుగులో అప్పట్లో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన “విజేత విక్రమ్” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.ఆయా తర్వాత ఫరహ్ నాజ్ తెలుగులో నటించలేదు.కానీ ఎక్కువగా గా హిందీ, పంజాబీ చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.అందువల్లనే ఫరహ్ నాజ్   గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా తెలియదు.కాగా ఫరహ్ నాజ్ 1996వ సంవత్సరంలో విందూ దారా సింగ్ అనే బాలీవుడ్ నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

కానీ పెళ్లయిన కొంతకాలానికే ఇద్దరి మధ్య మనస్పర్థలు, విభేదాలు రావడంతో 2002వ సంవత్సరంలో వీరిద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.ఆ తర్వాత కుటుంబ కలహాలతో ఫరహ్ నాజ్ కొంతకాలం పాటు కుటుంబ సభ్యులకి దూరంగా గడిపింది.

ఆ తర్వాత కోలీవుడ్ కి చెందిన సుమిత్ సైగల్ అనే నటుడు మరియు నిర్మాతని 2003వ సంవత్సరంలో పెళ్లి చేసుకుంది.ప్రస్తుతం వీరు కేరళలో నివాసం ఉంటున్నట్లు సమాచారం.

అయితే పెళ్లి అయిన తర్వాత ఫరహ్ నాజ్ సినిమాలకి పూర్తిగా గుడ్ బై చెప్పింది.దీంతో ప్రస్తుతం కుటుంబ బాధ్యతలను చక్కబెడుతుంది.ఇక హీరోయిన్ టబు విషయానికొస్తే ఆమధ్య స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠ పురంలో చిత్రంలో హీరో తల్లి పాత్రలలో నటించి ప్రేక్షకులను బాగా అలరించింది.కాగా ప్రస్తుతం తెలుగులో యంగ్ హీరో నితిన్ హీరోగా నటిస్తున్న ఓ హిందీ రీమేక్ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube