ఈ హీరోయిన్ ఆ దర్శకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.. కానీ పెళ్ళైన నాలుగేళ్లకే...

తెలుగులో ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన 7/జి బృందావన్ కాలనీ అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ హీరోయిన్ “సోనియా అగర్వాల్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.మొదటగా సోనియా అగర్వాల్ తెలుగులో “నీ ప్రేమకై” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి నటిగా పరిచయం అయింది.

 Telugu Veteran Heroine Sonia Agarwal Marriage News And Divorce News, Telugu Vete-TeluguStop.com

ఆ తర్వాత తమిళం, కన్నడ, మలయాళం, తదితర భాషలలో సినిమా అవకాశాలు రావడంతో తెలుగు సినిమాలపై పెద్దగా దృష్టి సారించ లేకపోయింది.దీంతో గతంలో ఈ అమ్మడు ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలలో కనిపిస్తూ బాగానే ప్రేక్షకుల్ని అలరించింది.

అయితే సినిమాల పరంగా కెరియర్ బాగానే సాగిపోతున్న సమయంలో 7/జి బృందావన్ కాలనీ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు సెల్వరాఘవన్ ని ప్రేమించి ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో 2006వ సంవత్సరంలో పెళ్లి చేసుకుంది.దీంతో పెళ్లయిన తర్వాత దాదాపుగా ఆరు సంవత్సరాల పాటు సోనియా అగర్వాల్ సినిమా పరిశ్రమకు దూరంగా ఉంది.

అయితే ఏమైందో ఏమో కానీ పెళ్లయిన నాలుగు సంవత్సరాలకి వీరిద్దరి మధ్య మనస్పర్ధలు, గొడవలు మొదలవడంతో ఇరువురి అంగీకారంతో 2010వ సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు.కానీ సెల్వరాఘవన్ మాత్రం సోనియా అగర్వాల్ కి విడాకులు ఇచ్చిన సంవత్సరానికే గీతాంజలి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు.

  కానీ సోనియా అగర్వాల్ మాత్రం ముంబై లో ఉన్నటువంటి తన సొంత నివాసంలో ఒంటరిగా ఉంటున్నట్లు సమాచారం.

అయితే విడాకుల అనంతరం సోనియా అగర్వాల్ మళ్లీ సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది.

కానీ ఈ అమ్మడికి ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలే తలుపు తడుతున్నాయి.దీంతో తన సినిమా కెరీర్ ని దృష్టిలో పెట్టుకుని సోనియా అగర్వాల్ ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధమైంది.

ఈ క్రమంలో టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన “టెంపర్” చిత్రంలో డాక్టర్ పాత్రలో కనిపించింది.

అలాగే ఇటీవల టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా నటించిన “రెడ్” చిత్రంలో హీరో తల్లి పాత్రలో కనిపించింది.

కాగా ప్రస్తుతం తమిళంలో ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న “భగీర” అనే చిత్రంలో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులుముంబై పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube