స్నానం చేస్తున్నప్పుడు తీసిన పోటోలను షేర్ చేసిన హీరోయిన్.... దాంతో...

తెలుగులో ప్రముఖ దర్శకుడు ఎ.కోదండరామి రెడ్డి దర్శకత్వం వహించిన “గొడవ” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ ఆర్య గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

 Telugu Veteran Heroine Shraddha Arya Looks Stunning In Bath Outfit, Shraddha Ary-TeluguStop.com

అయితే వచ్చీరావడంతోనే ఈ అమ్మడు తెలుగులో మంచి హిట్ ని అందుకున్నప్పటికీ తెలుగు సినిమా పరిశ్రమలోని అవకాశాల విషయంలో కొంతమేర అవగాహన లోపించడంతో ఎక్కువ కాలం హీరోయిన్ గా కొనసాగలేక పోయింది.కానీ శ్రద్ధ ఆర్య తెలుగులో నటించింది తక్కువ చిత్రాలలో అయినప్పటికీ తనకంటూ కొంత మంది అభిమానులను సంపాదించుకుంది.

అయితే ఈ మధ్య కాలంలో శ్రద్ధ ఆర్య సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు అందుబాటులో ఉంటోంది.కాగా తాజాగా తన అధికారిక ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసినటువంటి కొన్ని ఫోటోల వల్ల ప్రస్తుతం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఆ ఫోటోలను ఒకసారి పరిశీలించినట్లయితే షవర్ కింద బికిని దుస్తులు ధరించి స్నానం చేస్తున్న సమయంలో తీసినట్లు తెలుస్తోంది.దీంతో కొందరు నెటిజన్లు ఈ ఫోటోలోపై స్పందిస్తూ శ్రద్ద ఆర్య పై మండి పడుతున్నారు.

అంతేకాకుండా వ్యక్తిగతంగా ఉంచుకోవాల్సిన ఫోటోలను ఇలా సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేయడం వల్ల భవిష్యత్తులో పలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని కాబట్టి వెంటనే ఆ ఫోటోలను తొలగించాలని కోరుతున్నారు.అయినప్పటికీ శ్రద్ద ఆర్య మాత్రం ఇలాంటి కామెంట్లను అస్సలు ఖాతరు చేయడం లేదు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఆ మధ్య సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయిన సమయంలో శ్రద్ధ ఆర్య తన వైవాహిక జీవితంపై దృష్టి సారించింది.ఈ క్రమంలో 2015 సంవత్సరంలో ఓ ఎన్నారై తో నిశ్చితార్థం కూడా చేసుకుంది.కానీ నిశ్చితార్థం అయిన కొంతకాలానికే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు, విభేదాలు రావడంతో ఈ పెళ్లి కాస్త పెటాకులైంది. దీంతో 2019 వ సంవత్సరంలో మళ్లీ పంజాబ్ కి చెందినటువంటి ఓ నటుడితో ఈ అమ్మడు ప్రేమలో పడినట్లు సమాచారం.

కానీ వీరిద్దరి రిలేషన్ షిప్ పై మాత్రం ఇప్పటి వరకు శ్రద్ధ ఆర్య ఎలాంటి కామెంట్లు చేయలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube