ఈ తెలుగు హీరోయిన్ మాజీ భర్త తమిళంలో పెద్ద విలన్ అని మీకు తెలుసా..?

ఒకప్పుడు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, నందమూరి నటసింహం బాలయ్య బాబు, విక్టరీ వెంకటేష్ తదితర స్టార్ హీరోల చిత్రాల్లో నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న టాలీవుడ్ ప్రముఖ సీనియర్ హీరోయిన్ “సీత” గురించి సినిమా పరిశ్రమలో తెలియనివారుండరు.అయితే నటి సీత ఓవర్ ఎక్స్పోజింగ్ కి దూరంగా ఉంటూ ఎన్నో ఫ్యామిలీ ఓరియెంటెడ్ పాత్రలతో బాగానే అలరించింది.

 Telugu Veteran Heroine Seetha  Ex Husband R Parthiban News, R Parthiban, Tamil A-TeluguStop.com

అయితే సినిమా జీవితం పరంగా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న “సీత” తన వైవాహిక జీవితంలో మాత్రం సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో పలు ఇబ్బందులను ఎదుర్కొంది.

అయితే ఇందులో భాగంగా వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న సమయంలో తమిళంలో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు “పార్తభన్” ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

అయితే పెళ్లి అయిన కొత్తలో ఈ ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కానీ పార్తభన్ పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి నష్టపోయాడు. దీంతో కొంతమేర ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో 2001వ సంవత్సరంలో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.

కానీ అప్పటికే వీరిద్దరికీ ముగ్గురు పిల్లలు ఉన్నారు.దీంతో 2011 వ సంవత్సరంలో పలు ధారావాహికలలో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ టీవీ సీరియల్ ఆర్టిస్ట్ సతీష్ ని పెళ్లి చేసుకుంది.

 కానీ ఈ పెళ్లి బంధం కూడా ఎక్కువకాలం నిలబడలేదు. దీంతో 2016 సంవత్సరంలో సీత మళ్లీ విడాకులు తీసుకుంది.

 ప్రస్తుతం తన పిల్లలతో కలిసి ఇ చెన్నైలో నివాసముంటున్నట్లు సమాచారం.

Telugu Hiban, Seetha, Seetha Divorce, Tamil, Telugu Veteran, Teluguveteran, Toll

అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, తదితర భాషలలో కలిపి సీత దాదాపుగా 200కు పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.  ఇటు బుల్లితెర ప్రేక్షకులను కూడా పలు ధారావాహికల ద్వారా బాగానే అలరించింది.కానీ తన వ్యక్తిగత జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో సీత తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొని సినీ జీవితం పై దృష్టి సారించ లేకపోయింది.

ప్రస్తుతం పలు తమిళ చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube