బురఖా ధరించినంత మాత్రాన అలా ఉన్నట్లు కాదు...

తెలుగులో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన “కత్తి” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన ముంబై బ్యూటీ “సనా ఖాన్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే సనా ఖాన్ చాలా కష్టపడి తన కుటుంబ సభ్యులను ఒప్పించి సినిమా పరిశ్రమకి వచ్చింది.

 Telugu Veteran Heroine Sana Khan Strong Reply To The Netizen-TeluguStop.com

ఈ క్రమంలో పలు చిత్రాలలో హీరోయిన్ గా నటించే అవకాశాలు దక్కించుకున్నప్పటికీ ఆ చిత్రాలు బాక్సాఫీసు వద్ద డిజాస్టర్గా నిలిచాయి.దీంతో ఈ అమ్మడికి సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.

ఇక చేసేదేమీలేక సినిమాలకు గుడ్ బై చెప్పి తన వ్యక్తిగత జీవితంపై దృష్టి సారించింది.ఈ క్రమంలో ముంబైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

 Telugu Veteran Heroine Sana Khan Strong Reply To The Netizen-బురఖా ధరించినంత మాత్రాన అలా ఉన్నట్లు కాదు…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో అప్పటి నుంచి సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటోంది.

కానీ సోషల్ మీడియా మాధ్యమాలలో మాత్రం తరచూ బాగానే యాక్టివ్ గా ఉంటోంది.

అయితే తాజాగా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ద్వారా లైవ్ కార్యక్రమం నిర్వహించింది.ఈ క్రమంలో ఓ నెటిజన్ “మీరు ఉన్నత చదువులు చదివి బురఖా ధరించడం, పరదా వెనుక దాక్కోవడం” వంటి వాటి వల్ల ప్రయోజనం ఏముందని.? అడిగాడు.దీంతో సనా ఖాన్ తనదైన శైలిలో స్పందిస్తూ బురఖా ధరించడం, పరదా వెనుక దాక్కోవడం వల్ల తనకి మరియు తాను చేసేటువంటి పనులకు ఎలాంటి ఆటంకం లేదని రిప్లై ఇచ్చింది.

అంతేకాకుండా ఇటీవలే తన చదువును కూడా పూర్తి చేశానని కూడా తెలిపింది.బురఖా ధరించడం వల్ల సమస్యలేమీ ఉండవని, తాను కేవలం సాంప్రదాయ ఆచారాలను పాటిస్తున్నట్లు కూడా తెలిపింది.

Telugu Kathi Movie, Sana Khan, Telugu Veteran Heroine, Telugu Veteran Heroine Sana Khan Strong Reply To The Netizen, Tollywood-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా సనా ఖాన్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, తదితర భాషలలో కలిపి దాదాపుగా 20 కి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటించింది.కానీ ఈ చిత్రాలలో ఎక్కువ శాతం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి.కాగా చివరగా సనా ఖాన్ విశాల్ హీరోగా నటించిన “అయోగ్య” చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ లో నటించింది.ఈచిత్రం బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

#TeluguVeteran #TeluguVeteran #Sana Khan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు