ఈ హీరోయిన్ కి 40 ఏళ్ళ వయసు దాటిన అందం ఏమాత్రం తగ్గలేదు....

తెలుగులో ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున, నందమూరి బాలకృష్ణ, తదితర స్టార్ హీరోలతో కలిసి నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ “మీనా” గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నటి మీనా టాలీవుడ్ లో మాత్రమే కాకుండా కోలీవుడ్ లో కూడా రజనీకాంత్, కమల్ హాసన్, తదితర స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది.

 Telugu Veteran Heroine Meena Young Look Photos Viral-TeluguStop.com

అయితే ఒకప్పుడు స్టార్ హీరోల చిత్రాల్లో నటించిన మీనా ఒకానొక సమయంలో సినిమా అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది.ఈ క్రమంలో తన వైవాహిక జీవితం పై దృష్టి సారించి తమిళనాడు రాష్ట్రానికి చెందిన “విద్యా సాగర్” అనే ప్రముఖ వైద్యుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

కాగా ప్రస్తుతం వీరికి ఒక పాప కూడా ఉంది.

 Telugu Veteran Heroine Meena Young Look Photos Viral-ఈ హీరోయిన్ కి 40 ఏళ్ళ వయసు దాటిన అందం ఏమాత్రం తగ్గలేదు….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే పెళ్లయిన తర్వాత కొంతకాలం పాటు మీనా కుటుంబ బాధ్యతలను చక్కబెట్టే పనిలో భాగంగా సినిమాలకు పూర్తిగా దూరమైంది.

కాగా ఇటీవలే మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించినప్పటికీ ఆశించిన స్థాయిలో రాణించలేక పోతోంది.అయితే ఈ మధ్య నటి మీనా సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.

ఈ క్రమంలో తాజాగా నటి మీనా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది.దీంతో ప్రస్తుతం కొందరు మీనా అభిమానులు ఈ ఫోటోపై స్పందిస్తూ నటి మీనా కి 40 ఏళ్ల వయసు పైబడినప్పటికీ ఇప్పటికీ తన అందం ఏ మాత్రం తగ్గలేదని కామెంట్లు చేస్తున్నారు.

అలాగే ఈ ఫోటోలను షేర్ చేసిన అతికొద్ది సమయంలోనే దాదాపుగా లక్షల పైచిలుకు లైకులు, కామెంట్లు వచ్చాయి.

Telugu Meena, Meena Young Look, Telugu Veteran Heroine, Telugu Veteran Heroine Meena Young Look Photos Viral, Tollywood-Movie

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మీనా తెలుగులో “దృశ్యం 2” అనే చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తోంది.కాగా ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్నాడు.ఈ చిత్రానికి తమిళ ప్రముఖ దర్శకుడు జీతు జోసెఫ్ దర్శకత్వం వహిస్తుండగా టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

కాగా గతంలో దృశ్యం చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.దాంతో ఈ చిత్రానికి సీక్వెల్ గా ఈ దృశ్యం 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

కాగా ఆ మధ్య దృశ్యం 2 చిత్రాన్ని మలయాళం భాషలో విడుదల చేయగా మంచి హిట్ అయ్యింది.

#TeluguVeteran #TeluguVeteran #Meena

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు