తెలుగులో తళుక్కున మెరిసి బాలీవుడ్ కి వెళ్ళిపోయిన ఈ హీరోయిన్ మీకు గుర్తుందా..?  

Telugu veteran heroine Kriti Kharbanda Bollywood movie offers, Kriti Kharbanda, Bollywood, Movie offers, Telugu heroine, Tollywood,  - Telugu Bollywood, Kriti Kharbanda, Movie Offers, Telugu Heroine, Telugu Veteran Heroine Kriti Kharbanda Bollywood Movie Offers, Tollywood

తెలుగులో ప్రముఖ దర్శకుడు రాజ్ పిప్పల దర్శకత్వం వహించిన “బోణి” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ “కృతి కర్బంద” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు వచ్చి రావడంతోనే స్టార్ హీరో సుమంత్ అక్కినేని సరసన నటించే అవకాశం దక్కించుకున్నప్పటికీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

TeluguStop.com - Telugu Veteran Heroine Kriti Kharbanda Bollywood Movie Offers

 దీంతో ఈ అమ్మడికి గుర్తింపు కరువైంది.కానీ పట్టు విడవకుండా ప్రయత్నిస్తూ సినిమా అవకాశాలు దక్కించుకుని బాగానే రాణించింది.

దీంతో కన్నడ, తమిళం, మలయాళం తదితర భాషలలో కూడా హీరోయిన్ గా నటించింది.ఆ తర్వాత 2016వ సంవత్సరంలో బాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరో ఇమ్రాన్ హాష్మియా హీరోగా నటించిన “రాజ్ రీబూట్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది.

TeluguStop.com - తెలుగులో తళుక్కున మెరిసి బాలీవుడ్ కి వెళ్ళిపోయిన ఈ హీరోయిన్ మీకు గుర్తుందా..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది.దీంతో ఈ అమ్మడికి బాలీవుడ్లో వరుస సినిమా అవకాశాలు క్యూ కట్టాయి.అయితే ఇందులో ఈ అమ్మడు నటించిన  “హౌస్ ఫుల్ – 4, షాదీ మే జరూర్ ఆనా, గెస్ట్ ఇన్ లండన్,  కారవాన్, తదితర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సాధించాయి.దీంతో ప్రస్తుతం కృతి కర్బందా హీరోయిన్ గా బాగానే రాణిస్తోంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం బాలీవుడ్లో కృతికర్బందా “టైస్” అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. అంతేకాక ఓ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న “14 పేరే” అనే చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

ఏదేమైనప్పటికీ బాలీవుడ్లో అవకాశాలు దక్కించుకున్న తర్వాత కృతి కర్బంద తెలుగు సినిమా పరిశ్రమను పూర్తిగా మర్చిపోయింది.

#TeluguVeteran #Kriti Kharbanda

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Veteran Heroine Kriti Kharbanda Bollywood Movie Offers Related Telugu News,Photos/Pics,Images..