నేనెవరినీ అవకాశాలు ఇవ్వమని అడగను...అందుకే...

తెలుగులో తెలుగులో ప్రముఖ కమెడియన్ మరియు హీరో ఆలీ హీరోగా నటించిన “యమలీల” చిత్రంలో హీరోయిన్ గా నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ వెటరన్ హీరోయిన్ “ఇంద్రజ” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే  ఇంద్రజ వరుస సినిమా అవకాశాలతో బాగానే రాణిస్తున్నప్పుడు కోలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

 Telugu Veteran Heroine Indraja About Her Movie Offers In Film Industry-TeluguStop.com

 ఆ తర్వాత కొంత కాలం పాటు సినిమాలకు విరామం ఇచ్చింది. అయితే తాజాగా ఇంద్రజ ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని ఆసక్తికర విషయాల ప్రేక్షకులతో పంచుకుంది.

అయితే ఇందులో భాగంగా తాను సినిమా పరిశ్రమలో అవకాశాల కోసం ఎవరి దగ్గర చేయి చాపలేదని, అలాగే తమ చిత్రంలో నటించమని వచ్చిన దర్శక నిర్మాతలకి అస్సలు నో చెప్పలేదని కూడా తెలిపింది.తనకు ఇతరులను సినిమాల పరంగా అవకాశాలు అడగాలంటే కొంతమేర సిగ్గు మరియు బిడియమని అందువల్లనే ఇతరులను సినిమా అవకాశాలను అడగలేదని చెప్పుకొచ్చింది.

 Telugu Veteran Heroine Indraja About Her Movie Offers In Film Industry-నేనెవరినీ అవకాశాలు ఇవ్వమని అడగను…అందుకే…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాగే తనకి కళా తపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన స్వర్ణ కమలం చిత్రం అంటే ఎంతో ఇష్టమని ఆ చిత్రంలో భాను ప్రియ నటించిన క్లాసికల్ డాన్సర్ పాత్ర తనని ఎంతగానో ఇంప్రెస్ చేసిందని చెప్పుకొచ్చింది.

అలాగే ఈ చిత్రం చూసిన తర్వాత అలాంటి క్లాసికల్ డాన్సర్ పాత్రలో నటించాలని తనకు కోరిక కలిగిందని కానీ ఇప్పటివరకు ఆ కోరిక నెరవేరలేదని తెలిపింది.అయితే తాను ఎప్పుడూ కూడా ఇలాంటి పాత్రలే చేయాలని అనుకోలేదని అందువల్లే కానీ ఇప్పటి వరకు నటించిన చిత్రాలతో తాను చాలా సంతోషంగా ఉన్నానని తన అభిప్రాయం వ్యక్తం చేసింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా పెళ్లయిన తర్వాత కుటుంబ బాధ్యతలను చక్కదిద్దే పనిలో పడిన ఇంద్రజ దాదాపుగా ఏడు సంవత్సరాల పాటు సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత 2014వ సంవత్సరంలో టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య హీరోగా నటించిన “దిక్కులు చూడకు రామయ్య” అనే చిత్రం ద్వారా మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించింది.

ప్రస్తుతం సినిమా ఆఫర్లతో బాగానే రాణిస్తోంది.అయితే ఇటీవలే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన అల్లుడు అదుర్స్ చిత్రంలో హీరో తల్లి పాత్రలో నటించింది.

#IndrajaAbout #Indraja #TeluguVeteran #TeluguVeteran

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు