ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..?

తెలుగులో అప్పట్లో  ప్రముఖ సీనియర్ దర్శకుడు “కె.రాఘవేంద్ర రావు” దర్శకత్వం వహించిన “పెళ్లి సందడి” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన ముంబై హీరోయిన్ “దీప్తి భట్నాగర్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.

 Telugu Veteran Heroine Deepti Bhatnagar Yoga Photos Viral-TeluguStop.com

అయితే నటి దీప్తి భట్నాగర్ తెలుగులో నటించింది తక్కువ చిత్రాలలోనే అయినప్పటికీ తన అందం, అభినయంతో ప్రేక్షకుల్ని బాగానే కట్టిపడేసింది.అలాగే దీప్తి భట్నాగర్ హిందీ సినిమా పరిశ్రమకు చెందిన నటి కావడంతో తెలుగుపై పెద్దగా దృష్టి సారించ లేకపోయింది.

కానీ హిందీలో మాత్రం దాదాపుగా 15 కి పైగా చిత్రాలలో నటించింది.కాగా ఒకానొక సమయంలో సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడంతో తన వైవాహిక జీవితం పై దృష్టి సారించింది ఈ క్రమంలో హిందీ సినిమా పరిశ్రమకి చెందిన “రణదేప్ ఆర్య” అనే డైరెక్టర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

 Telugu Veteran Heroine Deepti Bhatnagar Yoga Photos Viral-ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా ప్రస్తుతం సినిమాలకు గుడ్ బై చెప్పి కుటుంబ బాధ్యతలను చక్కబెట్టే పనిలో పడింది అంతేకాకుండా ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ పరిసర ప్రాంతంలో హ్యాండ్ లూమ్స్ కి సంబంధించిన ఫ్యాక్టరీని స్థాపించి ప్రస్తుతం వ్యాపారాల్లో బాగానే రాణిస్తోంది.

అయితే నటి దీప్తి భట్నాగర్ సినిమాలకు గుడ్ బై చెప్పినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఫోటోలను తన అభిమానులతో పంచుకుంటుంది.

కాగా ఇటీవలే  యోగా దినోత్సవం సందర్భంగా నటి దీప్తి భట్నాగర్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా యోగా చేస్తున్న సమయంలో తీసిన ఫోటో ని షేర్ చేసింది.దీంతో ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ ఫోటో పై కొందరు నెటిజన్లు స్పందిస్తూ నటి దీప్తి భట్నాగర్ “53 ఏళ్ల వయసు” పైబడిన ప్పటికీ ఫిట్నెస్ మెయింటెన్ చేస్తూ బాగానే అలరిస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా నటి దీప్తి భట్నాగర్ తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, తదితర భాషలలో కలిపి దాదాపుగా 25 కి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.అయితే తెలుగులో నటి దీప్తి భట్నాగర్ పెళ్లి సందడి, ఆటో డ్రైవర్, సుల్తాన్, మా అన్నయ్య, కొండవీటి సింహాసనం, తదితర చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.ఈ చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నాయి.

#TeluguVeteran #TeluguVeteran #DeeptiBhatnagar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు