నాకు ఆ సమస్య ఉంది.. అందుకే బిగ్ బాస్ కి వెళ్ళ లేదు...

తెలుగులో ఒకప్పుడు గర్ల్ ఫ్రెండ్, గుడ్ బాయ్, అనగనగా ఓ కుర్రాడు, సొంతం, జానకి వెడ్స్ శ్రీరామ్, నవ వసంతం, తదితర చిత్రాలతో సినిమా ప్రేక్షకులను బాగానే అలరించిన ప్రముఖ “సీనియర్ హీరో రోహిత్” గురించి సినిమా ప్రేక్షకులకి కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.ఒకప్పుడు వరుస అవకాశాలతో బాగానే రాణించిన రోహిత్ అనుకోకుండా అవకాశాలు కరువవడంతో ప్రస్తుతం సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటున్నాడు.

 Telugu Veteran Hero Rohit About Bigg Boss Offer-TeluguStop.com

కాగా తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.

ఇందులో భాగంగా తనకు సినిమా పరిశ్రమలో పెద్దగా స్నేహితులు ఎవరూ లేరని, కానీ అప్పటి తరం నటీనటులు బాలాదిత్య మరియు శివ బాలాజీ అలాగే ఆర్యన్ రాజేష్ లు మంచి స్నేహితులని ఇప్పటికీ చాలా క్లోజ్ గా ఉంటామని తెలిపారు.

అయితే ఆ మధ్య శివ బాలాజీ బిగ్ బాస్ టైటిల్ గెలుచుకున్న సమయంలో బిగ్ బాస్ రెండవ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొనేందుకు తనని రిఫర్ చేశాడని కానీ తాను వద్దని చెప్పినట్లు తెలిపాడు.

అయితే తాను వద్దు అనడానికి కారణాలు ఉన్నాయని ఇందులో ముఖ్యంగా తాను ఒకే చోట ఎక్కువ రోజులు ఒంటరిగా ఉండాలంటే ఇబ్బంది పడతానని తెలిపాడు.

ఒకవేళ తాను బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో కి వెళ్లినప్పటికీ ఒకటి లేదా రెండు వారాల కంటే ఎక్కువ రోజులు ఉండలేనని వెంటనే తిరిగే వచ్చేయాల్సిందేనని, తనకు ఈ ఫోబియా తన సినీ కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచే ఉందని తెలిపాడు.అందువల్లనే తాను ఒకే చోట లేదా ఒకే రూములో ఎక్కువ సేపు కూడా ఉండలేనని చెప్పుకొచ్చాడు.

Telugu Big Boss, Bigboss, Rohit, Shiva Balaji, Telugu Heros, Teluguveteran, Toll

అయితే ఇటీవలే తాను తనకి దగ్గరి బంధువైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని ప్రస్తుత చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నట్లు తెలిపాడు.అలాగే సినిమా పరిశ్రమలో ఉన్నంతకాలం తాను హీరోగా ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నం చేశానని ప్రస్తుతం తన కెరియర్ ముగిసిందని అందువల్లనే తన సినిమా ప్రయత్నాలు మానుకొని వ్యాపారాల వైపు దృష్టి సారించాలని చెప్పుకొచ్చాడు.అలాగే తన పాత్రకి ప్రాధాన్యత ఉన్నటువంటి అవకాశం వస్తే ఖచ్చితంగా మళ్లీ సినిమాల్లో నటిస్తానని కూడా స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube