బీజేపీలో చేరుతున్న సీనియర్ తెలుగు నటుడు...

తెలుగులో దాదాపుగా నాలుగు వందలకు పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు “నటకిరీటి రాజేంద్ర ప్రసాద్” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కాగా రాజేంద్ర ప్రసాద్ హీరోగానే కాకుండా అప్పుడప్పుడు పలు చిత్రాల్లో గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలలో కూడా నటించి బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Telugu Veteran Hero Rajendra Prasad Is Joining To The Bjp Party, Telugu Veteran-TeluguStop.com

ఈ మధ్యకాలంలోక్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకి పరిమితమైన రాజేంద్ర ప్రసాద్ రాజకీయాల్లో చేరడానికి సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం.

తాజాగా రాజేంద్ర ప్రసాద్ ని భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తన నివాసంలో కలిసి ఘనంగా సత్కరించాడు.

 దీంతో రాజేంద్ర ప్రసాద్ తొందర్లోనే భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకోబోతున్నాడని టాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నారు.ఈ క్రమంలో రాజేంద్ర ప్రసాద్ సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తిగా రాజకీయాల వైపు దృష్టి సాధించడానికి సన్నద్ధమవుతున్నట్లు కూడా పలు వార్తలకు బలంగా వినిపిస్తున్నాయి.

కానీ రాజేంద్ర ప్రసాద్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు వినిపిస్తున్నటువంటి వార్తలపై మాత్రం ఇప్పటివరకు స్పందించ లేదు.  దీంతో ఈ వార్తల్లో నిజమెంతుందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

Telugu Rajendra Prasad, Somu Veerraju, Somuveerraju, Telugu Veteran, Teluguveter

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం తెలుగులో నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహిస్తున్న “సోలో బ్రతుకే సో బెటర్” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నాడు.అలాగే ఇటీవలే రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన “మిస్ ఇండియా” అనే చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేశారు.కానీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube