ఈ సీనియర్ హీరోని ఒకప్పటి హీరో అని కూడా చూడకుండా ఆటోడ్రైవర్ దారుణంగా...  

Telugu veteran hero jagapathi about Legend movie offer and remuneration, jagapathi babu, Telugu veteran hero, Auto Driver Insulting, Tollywood, Good luck Sakhi,, Legend movie offer and remuneration - Telugu Auto Driver Insulting, Good Luck Sakhi, Jagapathi, Jagapathi Babu, Legend Movie Offer And Remuneration, Telugu Veteran Hero, Telugu Veteran Hero Jagapathi About Legend Movie Offer And Remuneration, Tollywood

తెలుగులో ఒకప్పుడు పలు ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలతో సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రముఖ సీనియర్ నటుడు “జగపతి బాబు” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే జగపతి బాబు ఒకానొక సమయంలో స్టార్ హీరోగా రాణించినప్పటికీ  ట్రెండ్ మారడంతో హీరోగా అవకాశాలను దక్కించుకోలేక పోయాడు.

TeluguStop.com - Telugu Veteran Hero Jagapathi About Legend Movie Offer And Remuneration

 దీంతో కొంత కాలం పాటు సినిమా అవకాశాలు లేక ఇంటి వద్దనే కాలం గడిపాడు.

కానీ తెలుగులో నందమూరి నట సింహం బాలయ్య బాబు హీరోగా నటించిన “లెజెండ్” అనే చిత్రంలో విలన్ గా నటించి మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించి ప్రస్తుతం బాగానే రాణిస్తున్నాడు.

TeluguStop.com - ఈ సీనియర్ హీరోని ఒకప్పటి హీరో అని కూడా చూడకుండా ఆటోడ్రైవర్ దారుణంగా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

 తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో జగపతి బాబు పాల్గొన్నాడు. ఇందులో భాగంగా తాను ఎదుర్కొన్న ఓ సంఘటన గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు.

ఇందులో సినిమా అవకాశాలు లేక తాను ఇంటి వద్ద ఖాళీగా గడుపుతున్న సమయంలో ఓ ఆటో డ్రైవర్ తన వద్దకు వచ్చి తాను ఓ చిత్రంలో హీరోగా నటిస్తున్నానని నీకు కావాలంటే ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రను ఇస్తానంటూ ఎద్దేవా చేశాడట.ఇలాంటి దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ మంచి రోజుల కోసం ఎంతో వేచి చూశానని చెప్పు కొచ్చాడు.

 ఈ క్రమంలో అవకాశం ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూస్తున్న సమయంలో “లెజెండ్” సినిమాలో నటించే అవకాశం వచ్చిందని తెలిపారు.

ఈ చిత్రంలో నటించినందుకు గాను చిత్ర యూనిట్ సభ్యులు తాను అనుకున్న దానికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చారని అంతేగాక ఈ చిత్రం తన సెకండ్ ఇన్నింగ్స్ కి ఎంతగానో ఉపయోగపడిందని కూడా తెలిపాడు.  తాను లైఫ్ లో కోట్ల రూపాయల డబ్బుని చూశానని, అలాగే ఖాళీ జేబు తో కూడా గడిపానని కాబట్టి తనకి ప్రస్తుతం డబ్బు మీద ఎలాంటి ఆశ లేదని కేవలం సంతోషంగా బ్రతకడానికి మాత్రమే ప్రాముఖ్యత ఇస్తానని చెప్పుకొచ్చాడు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం జగపతి బాబు తెలుగులో ప్రముఖ దర్శకుడు నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న “గుడ్ లక్ సఖి” అనే చిత్రంలో నటిస్తున్నాడు.

 కాగా ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తరహాలో ఉండనున్నట్లు సమాచారం. అలాగే ఇటీవలే తెలుగు ప్రముఖ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న “టక్ జగదీశ్” అనే చిత్రంలో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

 ఈ చిత్రంలో టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్నాడు.

#Jagapathi #AutoDriver #TeluguVeteran #TeluguVeteran #Good Luck Sakhi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు