మా నాన్న మరణంతో నా సినీ జీవితం మారిపోయిందంటున్న హీరో…  

Telugu veteran hero Aryan Rajesh about his father Evv Satyanarayana death, Aryan Rajesh, Telugu veteran hero, Evv Satyanarayana death, telugu movie offers, Tollywood hero - Telugu Aryan Rajesh, Evv Satyanarayana Death, Telugu Movie Offers, Telugu Veteran Hero, Telugu Veteran Hero Aryan Rajesh About His Father Evv Satyanarayana Death, Tollywood Hero

తెలుగులో దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన “హాయ్” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయం అయినటువంటి ఆర్యన్ రాజేష్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే వచ్చి రావడంతోనే తన మొదటి సినిమాతో ప్రేక్షకులను బాగానే అలరించిన “ఆర్యన్ రాజేష్” తన రెండో చిత్రం సొంతం తో టాలీవుడ్ సినీ పరిశ్రమలో పలు రికార్డులను నెలకొల్పాడు.

TeluguStop.com - Telugu Veteran Hero Aryan Rajesh About His Father Evv Satyanarayana

అయితే తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆర్యన్ రాజేష్ పాల్గొన్నాడు.

ఇందులో భాగంగా తాను మొదట్లో వరుస చిత్రాలతో హిట్ అందుకుని మంచి ఫామ్లో దూసుకుపోతున్న సమయంలో తన తండ్రి ఈవీవీ సత్యనారాయణ మరణం తనను ఎంతగానో కలచివేసిందని ఎమోషనల్ అయ్యాడు.

TeluguStop.com - మా నాన్న మరణంతో నా సినీ జీవితం మారిపోయిందంటున్న హీరో…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అంతేగాక తన తండ్రి మరణాంతరం తాను సినిమాలపై దృష్టి సారించ లేకపోయానని దీనికి తోడు కుటుంబ బాధ్యతలు కూడా తానే మోయాల్సి వచ్చిందని తెలిపాడు.అయితే ఈ మధ్య పరిస్థితులను అన్నీ చక్కబడ్డాయని దీంతో మళ్లీ సినిమాల్లో నటించేందుకు సన్నద్ధమవుతున్నట్లు తన పాత్రకి తగ్గట్టు అవకాశం వస్తే ఖచ్చితంగా నటిస్తానని తెలిపాడు.

అలాగే ఇప్పటికీ తనకి విలన్ పాత్రలో నటించాలనే కోరిక అలాగే ఉండిపోయిందని దర్శక నిర్మాతలు ఒప్పుకుంటే విలన్ పాత్రలో నటించడానికి అయినా సిద్ధమేనంటూ తెలిపాడు.

ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో ఆర్యన్ రాజేష్ హీరోగా నటించినటువంటి “హాయ్, సొంతం, ఎవడి గోల వాడిది, బురిడీ, ఆడంతే అదో టైపు, లీలామహల్ సెంటర్,” తదితర చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

అయితే ఇటీవలే టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన “వినయ విధేయ రామ” చిత్రంలో హీరో అన్నయ్య పాత్రలో నటించి ప్రేక్షకులను బాగానే మెప్పించాడు.కాగా ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నాడు.

#TeluguMovie #TeluguVeteran #TeluguVeteran #Aryan Rajesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Veteran Hero Aryan Rajesh About His Father Evv Satyanarayana Related Telugu News,Photos/Pics,Images..