నన్ను రాజకీయల్లోకి తీసుకొచ్చింది అతడే... కానీ పరిస్థితులు చూసి...- Telugu Veteran Comedian And Politician Babu Mohan About His Political Entry

Telugu veteran comedian and Politician babu mohan About his Political entry, babu mohan Political entry, babu mohan, Telugu Comedian, babu mohan Politician, KCR, telangana CM, Tollywood, - Telugu Babu Mohan, Babu Mohan Political Entry, Babu Mohan Politician, Kcr, Telangana Cm, Telugu Comedian, Telugu Veteran Comedian And Politician Babu Mohan About His Political Entry, Tollywood

తెలుగులో ఒకప్పుడు కమెడియన్ గా కొన్ని వందల చిత్రాల్లో నటించి తన హాస్య నటన ప్రతిభతో సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ సీనియర్ నటుడు మరియు కమెడియన్ “బాబు మోహన్” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే నటుడు బాబు మోహన్ కేవలం నటుడిగానే కాకుండా సినిమా పరిశ్రమలో పలు చిత్రాలకు సహా నిర్మాతగా కూడా వ్యవహరించాడు.

 Telugu Veteran Comedian And Politician Babu Mohan About His Political Entry-TeluguStop.com

అంతేకాకుండా రాజకీయాల్లో చేరి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం చక్రం తిప్పుతున్నాడు.కాగా తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తాను రాజకీయాల్లోకి ఎలాంటి పరిస్థితుల్లో వచ్చాననే విషయాల గురించి పలు ఆసక్తికర విషయాలలో ప్రేక్షకులతో పంచుకున్నాడు.

ఇందులో భాగంగా తాను వరుస సినిమా అవకాశాలతో చాలా బిజీ బిజీగా రాణిస్తున్న సమయంలో ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి “కల్వకుంట్ల చంద్రశేఖర రావు’ తనని బలవంతంగా రాజకీయాల్లోకి తీసుకువచ్చాడని తెలిపాడు. అంతేగాక తాను ఎంత వద్దని చెబుతున్నప్పటికీ బలవంతంగా పట్టుబట్టి ఎన్నికల్లో పోటీ చేసే విధంగా ప్రోత్సహించాడని, అలా తాను అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని తెలిపాడు.

 Telugu Veteran Comedian And Politician Babu Mohan About His Political Entry-నన్ను రాజకీయల్లోకి తీసుకొచ్చింది అతడే… కానీ పరిస్థితులు చూసి…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

 అయితే తాను మొదటిసారి ఎమ్మెల్యే గా నామినేషన్ వేసిన తర్వాత పగలంతా రాజకీయ ప్రచారాలు, పార్టీ పనులతో గడిపే వాడినని ఆ తర్వాత రాత్రి సమయంలో పలు చిత్రం షూటింగులలో పాల్గొనే వాడినని చెప్పుకొచ్చాడు. అయితే మొదట్లో కొంత కాలం పాటు రాజకీయాల్లో కొనసాగి మళ్లీ సినిమాలపై దృష్టి సారించాలని అనుకున్నప్పటికీ ప్రజా సమస్యలను తీర్చడం కోసం రాజకీయాల్లో కొనసాగించాల్సి వచ్చిందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

తాను ఆర్థిక శాఖలో పని చేశానని కాబట్టి అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క నియమ నిబంధన గురించి తనకి చాలా స్పష్టంగా తెలుసని అందువల్లనే ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఇప్పటి వరకు పని చేశానని తెలిపాడు.అంతేగాక తాను ఇప్పటివరకు లంచం తీసుకోకుండా, అధికారం దుర్వినియోగం చేయకుండా ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశానని అందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని తెలిపాడు.అలాగే డబ్బు, పదవులు శాశ్వతం కాదని తనకి మనుషులు మరియు వాళ్లు చేసేటువంటి మంచి పనులే భావితరాలకు మనల్ని గుర్తుపెట్టుకునేలా చేస్తాయని ఆ విషయాన్ని తాను బాగా నమ్ముతానని  తెలిపాడు.

#BabuMohan #Babu Mohan #Telangana Cm #BabuMohan #TeluguVeteran

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు