సోషల్ మీడియాలో బాగానే అలరిస్తున్న ఒకప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్...

ఒకప్పుడు తెలుగులో పలు చిత్రాలలో హీరోయిన్ స్నేహితురాలు, అలాగే హీరో చెల్లెలు తదితర పాత్రలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ “వర్ష” గురించి కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే వర్ష ముఖ్యంగా టాలీవుడ్ ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ తో కలిసి “వాసు” చిత్రంలో హీరో చెల్లెలి పాత్రలో నటించి బాగానే గుర్తింపు తెచ్చుకుంది.

 Telugu Veteran Character Artist Varsha Is Attracting With Her Reel Videos-TeluguStop.com

అలాగే మరో స్టార్ హీరో అయినా “రాజశేఖర్” తో కలిసి సింహ రాశి చిత్రంలో హీరో చెల్లెలి పాత్రలో నటించి పలు ఎమోషనల్ అండ్ సెంటిమెంట్ సన్నివేశాలలో నటించి బాగానే ఆకట్టుకుంది.అయితే తెలుగులో వందకు పైగా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించిన వర్ష పెళ్లయిన తర్వాత కొంతకాలంపాటు సినిమాలకి బ్రేక్ ఇచ్చింది.

అయితే ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన వర్ష ప్రస్తుతం పలు ధారావాహికలలో నటిస్తూ బాగానే రాణిస్తోంది.

 Telugu Veteran Character Artist Varsha Is Attracting With Her Reel Videos-సోషల్ మీడియాలో బాగానే అలరిస్తున్న ఒకప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా ఇటీవలే వర్ష సోషల్ మీడియా మాధ్యమాలలో అడుగు పెట్టింది.

దీంతో ఈ మధ్య బాగానే యాక్టివ్ గా ఉంటోంది.అంతేకాకుండా అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలను షేర్ చేస్తూ బాగానే అలరిస్తోంది.

కాగా ఈ మధ్య వర్ష షూటింగ్ బ్రేక్ సమయంలో పలువురు నటీనటులతో రీల్స్ చేస్తూ ప్రేక్షకులని బాగానే అలరిస్తోంది.దీంతో ప్రస్తుతం వర్ష కి రోజురోజుకీ ఫాలోవర్లు సంఖ్య బాగానే పెరుగుతోంది.

కాగా ప్రస్తుతం వర్ష ఇంస్టాగ్రామ్ ఖాతాని దాదాపుగా 8 వేల పైచిలుకు మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా వర్ష ప్రస్తుతం ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయిన మా టీవీలో ప్రసారమయ్యే “కస్తూరి” ధారావాహికలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలు నటిస్తోంది.అంతేకాకుండా అప్పుడప్పుడు పలు టాలీవుడ్ చిత్రాలలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటిస్తోంది.అయితే దాదాపుగా 5 సంవత్సరాల పాటు సినిమా పరిశ్రమకు దూరంగా ఉన్న వర్ష అజయ్ సెకండ్ ఇన్నింగ్స్ లో బాగానే ఆకట్టుకుంటూ అవకాశాలను దక్కించుకుంటోంది.

#Serial #TeluguVeteran #Varsha #Maa Tv #Kasthuri

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు