షో, ఈవెంట్ ఏదైనా, ప్రోగ్రామ్ ఏదైనా, సరే తన గల గల మాటలతో ప్రేక్షకులను కట్టిపడేసే టాలీవుడ్ యాంకరింగ్ క్వీన్ “సుమ కనకాల” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే సుమా సినిమా పరిశ్రమలో కేవలం యాంకర్ గా మాత్రమే కాకుండా పలు షోలు ఈవెంట్లకు హోస్ట్ గా కూడా వ్యవహరించింది.
అంతేగాక సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన “విన్నర్” చిత్రంలో ఒక పాటను కూడా పాడి తనలో ఉన్న గాయినిని పరిచయం చేసింది.ఈ మధ్యకాలంలో యాంకర్ సుమ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.
అంతేగాక అప్పుడప్పుడు తన అభిమానులతో చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించి పలు ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇస్తోంది.
తాజాగా సుమ కనకాల కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే ఆ ఫోటోలను ఒకసారి పరిశీలించినట్లయితే సుమ కనకాల మరియు ఆమె భర్త రాజీవ్ కనకాల అలాగే వారి పిల్లలు రోషన్ కనకాల, మనస్విని కనకాల తో కలిసి దిగినట్లు తెలుస్తోంది.దీంతో సుమ అభిమానులు ఈ ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ చేస్తున్నారు అంతే గాక ఈ ఫోటోలను షేర్ చేసిన కొద్దికాలంలోనే లక్షల సంఖ్యలో లైకులు కామెంట్లు వచ్చాయి.
దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు సుమ కి సోషల్ మీడియా మధ్య ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమిటో అని.
అయితే ఈ విషయం ఇలా ఉండగా సుమ కనకాల ప్రస్తుతం ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన ఈ టీవీ లో ప్రసారమయ్యే “క్యాష్ – దొరికినంత దోచుకో అలాగే స్టార్ మహిళ” తదితర షోలలో యాంకరింగ్ నిర్వహిస్తోంది.ఇక సుమ భర్త రాజీవ్ కనకాల విషయానికొస్తే ఇతడు కూడా పలు టాలీవుడ్ చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తూ రోజూ బిజీషెడ్యూల్ తో గడుపుతున్నాడు.తాజాగా రాజీవ్ కనకాల తన కొడుకు రోషన్ కనకాల ని నటుడిగా పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పలు వార్తలు వినిపిస్తున్నాయి.