స్టార్ హీరోయిన్ అవ్వాలంటే అది తప్పనిసరి అంటున్న వెటరన్ హీరోయిన్...

Telugu Veteran Actress Simran About Her Favorite Hero Rajinikanth

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున, వంటి స్టార్ హీరోల సరసన నటించి తన నటనతో సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన తెలుగు ప్రముఖ హీరోయిన్ సిమ్రాన్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.కాగా సిమ్రాన్ 1997వ సంవత్సరంలో “అబ్బాయిగారి పెళ్లి” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తన సినీ కెరీర్ ని మొదలు పెట్టింది.

 Telugu Veteran Actress Simran About Her Favorite Hero Rajinikanth-TeluguStop.com

ఈ క్రమంలో అందరిలాగే సినీ కెరీర్ మొదలు పెట్టిన సమయంలో సిమ్రాన్ కూడా కొంతమేర అవకాశాలకోసం ఇబ్బందులను ఎదుర్కొంది.కానీ పట్టు విడవకుండా శ్రమించి తమిళ, కన్నడ, తెలుగు, హిందీ, తదితర భాషలలో వరుసగా సినిమా అవకాశాలు దక్కించుకుంటూ బాగా రాణించింది.

ప్రస్తుతం వయసు మీద పడటంతో సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.దాంతో నటి సిమ్రాన్ అప్పుడప్పుడు పలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో కనిపిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో మాత్రం రాణించలేక పోతోంది.

 Telugu Veteran Actress Simran About Her Favorite Hero Rajinikanth-స్టార్ హీరోయిన్ అవ్వాలంటే అది తప్పనిసరి అంటున్న వెటరన్ హీరోయిన్…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తాజాగా సిమ్రాన్ గూగుల్ ద్వారా లైవ్ కార్యక్రమం నిర్వహించి పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.ఇందులో భాగంగా ఓ నెటిజన్ మీ ఆల్ టైమ్ ఫేవరేట్ హీరో ఎవరని అడగగా సిమ్రాన్ ఏ మాత్రం ఆలోచించకుండా తన ఫేవరెట్ హీరో సౌత్ సూపర్ స్టార్ “రజనీకాంత్” అని తెలిపింది.ఇక మరో నెటిజన్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలని అడిగింది.దీంతో సిమ్రాన్ ఈ విషయంపై స్పందిస్తూ సినిమా ఇండస్ట్రీలో అవకాశాలనేవి ఎప్పుడూ కూడా ఒకేలా ఉండవని కాబట్టి మన పాత్రకి ప్రాధాన్యత ఉన్నటువంటి అవకాశం వస్తే ఎప్పుడూ కూడా వదులుకోకూడదని తెలిపింది.

దాంతోపాటు పట్టువిడవకుండా శ్రమించే గుణం మరియు కష్ట పడేతత్వం వంటివి మీలో ఉంటే ఖచ్చితంగా విజయం వరిస్తుందని సూచించింది.

ఈ విషయం ఇలా ఉండగా సిమ్రాన్ బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన దీపక్ బగ్గా అనే వ్యక్తిని 2003వ సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకుంది.దీంతో పెళ్లయిన తర్వాత తన కుటుంబ బాధ్యతలను చక్కబెట్టే పనిలో పడిన సిమ్రాన్ సినిమా ఇండస్ట్రీకి చాలా తక్కువగా అందుబాటులో ఉంటోంది.కాగా ప్రస్తుతం సిమ్రాన్ హిందీ లో రాకెట్రీ : ది నంబీ ఎఫెక్ట్ అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.కాగా ఈ మధ్య కాలంలో నటి సిమ్రాన్ నిర్మాతగా వ్యవహరించేందుకు కూడా ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

#TeluguVeteran #Rajinikanth #TeluguVeteran #Simran

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube