10 లక్షలు ఇస్తే ఇంటర్వ్యూ ఇస్తానంటున్న సీనియర్ నటి...

పలు టాలీవుడ్ చిత్రాలలో “బామ్మ” పాత్రలలో నటించి సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ సీనియర్ నటి “రమా ప్రభ” గురించి సినిమా ప్రేక్షకులకి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే నటి రమా ప్రభ సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తలో పలు చిత్రాలలో హీరోయిన్ గా కూడా నటించింది.

 Telugu Veteran Actress Rama Prabha Is Demanding 10 Lakh Rupees For Interview-TeluguStop.com

ఆ తర్వాత అనుకోకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకి పరిమితమైనప్పటికీ నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.కాగా ఈ మధ్య కాలంలో నటి రమా ప్రభ కి వయసు మీదపడటంతో సినిమాలకి దూరంగా ఉంటోంది.

అయితే తాజాగా నటి రమా ప్రభ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని పాలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకుంది.

 Telugu Veteran Actress Rama Prabha Is Demanding 10 Lakh Rupees For Interview-10 లక్షలు ఇస్తే ఇంటర్వ్యూ ఇస్తానంటున్న సీనియర్ నటి…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా  ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మీరు సినిమాల్లో నటించడం మానేసిన తర్వాత ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదు…  కారణం ఏమిటో తెలుసుకోవచ్చా.? అని అడిగాడు.దీంతో రమా ప్రభ ఎవరో ఆనందం కోసం వారు చెప్పిందల్లా చేయడానికి తాను సిద్ధంగా లేనని అందువల్లే నేను ఎక్కువగా ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వనని స్పష్టం చేసింది.

అంతేకాక ఆ మధ్య తాను చాలా ఇంటర్వ్యూలలో చూశానని కొంత మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు పేర్లతో పిలిచే వారి హావభావాలను వ్యక్తం చేసే క్రమంలో అవమానిస్తున్నారని ఈ విషయం తనకి నచ్చలేదని చెప్పుకొచ్చింది.అంతేకాక తనకు పెద్దవారి పట్ల సంస్కారం లేకుండా ప్రవర్తించేవాళ్లంటే అస్సలు నచ్చదని తెలిపింది.

అలాగే ఇకపై ఎవరికైనా తన ఇంటర్వ్యూ కావాలనుకుంటే తనకి 10 లక్షల రూపాయలు ఇస్తే ఇంటర్వ్యూకి హాజరవుతానని సరదాగా తెలిపింది.

Telugu Rama Prabha About Interviews, Ramaprabha, Ramaprabha About Karma, Telugu Actress, Telugu Veteran Actress Ramaprabha Is Demanding 10 Lakh Rupees For Interview, Tollywood-Movie

అలాగే తాను అవకాశాలకోసం ఎప్పుడూ కూడా  ఎవరినీ అడగలేదని అంతేకాక మనకు దక్కాలని రాసి పెట్టి ఉంటే ఎలాంటి ప్రయత్నం చేయకున్నప్పటికీ ఖచ్చితంగా అది మన వద్దకు వస్తుందని విధిరాతను ఎవరూ మార్చలేరని ఈ విషయాన్ని తాను బాగా నమ్ముతానని తెలిపింది.అయితే ఈ విషయం ఇలా ఉండగా సినిమాల్లో నటించడం మానేసిన తర్వాత నటి రమాప్రభ ప్రస్తుతం తన సొంత గ్రామమైన చిత్తూరు జిల్లాలోని మదన పల్లెలో ఉంటోంది.

#Ramaprabha #TeluguVeteran #RamaPrabha #RamaprabhaAbout

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు