పాపం .. ఒకప్పటి ఈ హీరోయిన్ అమెరికాలో పని మనిషిగా కూడా...

తెలుగులో ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన  “భద్ర” చిత్రంలో ప్రముఖ హాస్య నటుడు గుండు హనుమంతరావు మరియు సీనియర్ నటి కృష్ణవేణి ల హాస్య సన్నివేశాలు తెలుగు సినీ ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తుంటాయి.అయితే సీనియర్ హీరోయిన్ కృష్ణ వేణి ఒకప్పుడు సినిమా పరిశ్రమకు రాకముందు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు.ఇందులో 10 సంవత్సరాలకే ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేయడంతో 13 ఏళ్ళకే ఓ పండంటి బిడ్డకు జన్మని కూడా ఇచ్చింది.  ఆ తర్వాత కొంత కాలానికి భర్తతో విభేదాలు రావడంతో విడిపోయి తనకు తెలిసిన వారి ద్వారా పలు ధారావాహికలలో నటించే అవకాశాలను తెచ్చుకొని తన కుటుంబం కోసం తన కోసం నటనా జీవితాన్ని ప్రారంభించింది.

 Telugu Veteran Actress Krishnaveni React About Her Struggles In Film Industry, -TeluguStop.com

అయితే తన నటనా జీవితంలో కూడా ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నా పట్టు విడవకుండా శ్రమించి మొదట్లో రెండు చిత్రాలలో హీరోయిన్గా కూడా నటించింది.ఇందులో ఒక చిత్రం మాత్రమే విడుదలవగా ఆ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో కృష్ణవేణి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి.

ఈ క్రమంలో హీరోయిన్ పాత్రలకు స్వస్తి చెప్పి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకు పరిమితమైంది.ఒకానొక సమయంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు కూడా తనను వరించకపోవడంతో ఇక చేసేదేమీలేక తన కుటుంబం కోసం అమెరికాలో ఉన్నటువంటి ఓ వృద్ధుడికి కేర్ టేకర్ గా కూడా కొంత కాలం పాటు పని చేసింది.

ఆ తర్వాత సినిమా పరిశ్రమకి చెందినటువంటి ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.కానీ పెళ్లి చేసుకున్న కొంతకాలానికి ఆ వ్యక్తి కూడా రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కృష్ణవేణి జీవితం మళ్ళీ మొదటికి వచ్చింది.

అయితే ఆ మధ్య కాలంలో పలు సీరియళ్లలో నటిస్తున్నట్లు తెలిపింది.కాగా ప్రస్తుతం కృష్ణవేణి తన కూతురుతో కలిసి హైదరాబాదులో నివాసం ఉంటున్నట్లు సమాచారం.

అయితే నటి కృష్ణవేణి కి తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి రజిత, రాగిణి తదితరులు బంధువులు అవుతారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube