ఈ సీనియర్ హీరోయిన్ ఆ క్రికెటర్ ని పెళ్లి చేసుకోవాలనుకుందట....కానీ

తెలుగులో అప్పట్లో హీరోయిన్ గా దాదాపుగా అందరి సీనియర్ హీరోల సరసన నటించి తెలుగు, తమిళ, ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సీనియర్ నటి జయసుధ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే అప్పట్లో హీరోయిన్ గా బాగానే రాణించగా ప్రస్తుతం వయసు మీద పడడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకి పరిమితమైంది.

 Telugu Veteran Actress Jayasudha About Marriage-TeluguStop.com

అయితే తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొంది.ఇందులో భాగంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.

ఇందులో తన తల్లిదండ్రులు చిన్నప్పటినుంచి తనని చాలా స్ట్రిక్ట్ గా పెంచారని చెప్పుకొచ్చింది. అంతేగాక ఒకానొక సమయంలో తన తండ్రి తనతో పాటు షూటింగులకు వచ్చేవాడిని ఆ సమయంలో తనని ఎవరైనా చిన్నచూపు చూసినా లేదా తనతో అసభ్యకరంగా ప్రవర్తించినా వారి అంతు చూసే వాడని తెలిపింది.

తన తల్లిదండ్రులు తనని ఎంతో ప్రేమిస్తారని అందువల్లనే చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తించే వారని చెప్పుకొచ్చింది.  అయితే అప్పట్లో తనకి సినిమా పరిశ్రమ వాళ్లను కాకుండా ప్రముఖ క్రికెటర్ అయినటువంటి ఇమ్రాన్ ఖాన్ ని పెళ్లి చేసుకోవాలని ఉండేదని మనసులో మాటని సరదాగా బయట పెట్టింది. 

అయితే తెలిసీ తెలియని వయసులో ప్రతి ఒక్క అమ్మాయికి ఇలాంటి ఆశలు ఉంటాయని అందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.అంతేగాక ఒక అప్పట్లో తాను హాలీవుడ్ కి చెందినటువంటి ప్రముఖ సింగర్ ను కూడా పెళ్లి చేసుకోవాలని కలలు కనే దానినని కానీ  అతడు నపుంసకుడని తెలిసిన తర్వాత కొంతమేర ఆశ్చర్యానికి లోనయ్యానని చెప్పుకొచ్చింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా 2017 సంవత్సరంలో నటి జయసుధ భర్త నితిన్ కపూర్ ఆత్మహత్య చేసుకొని మృతి చెందడంతో ప్రస్తుతం తనకు కొడుకులతో కలిసి హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటున్నట్లు సమాచారం.నటి జయసుధ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ, తదితర భాషలలో కలిపి దాదాపుగా 300కి పైగా చిత్రాలలో నటించింది.

 ఈ క్రమంలో 7 ఫిల్మ్ ఫేర్ అవార్డులను మరియు ఎనిమిది నంది అవార్డులను కూడా గెలుచుకుంది.అలాగే 7 చిత్రాలకి నిర్మాతగా కూడా వ్యవహరించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube