ఈ సీనియర్ నటి ఆ సింగర్ ని పెళ్లి చేసుకోవాలనుకుందట... కానీ గే అని తెలిసి....

తెలుగు చిత్రాలలో అమ్మ, అక్క, చెల్లి, తదితర పాత్రలలో నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న “ప్రముఖ సీనియర్ నటి జయసుధ” గురించి టాలీవుడ్ సినిమా పరిశ్రమలోని ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే జయసుధ ఒకప్పుడు అక్కినేని నాగేశ్వరరావు మరియు నందమూరి తారక రామారావు తదితర స్టార్ హీరోల చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించింది.

 Telugu Veteran Actress Jayasudha About Her Marriage Dreams, Telugu Veteran Actre-TeluguStop.com

 కానీ వయసు మీద పడడంతో హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుల పాత్రలకిపరిమితమైంది. అయితే ఆ మధ్య ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో జయసుధ పాల్గొని తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.

అయితే ఇందులో భాగంగా తనది చాలా సంప్రదాయబద్ధమైన కుటుంబమని దాంతో తన తండ్రి ఎంతో క్రమశిక్షణతో తమని పెంచాడని చెప్పుకొచ్చింది.ఇక అప్పట్లో తమది ఉమ్మడి కుటుంబం కావడంతో తమ ఇంట్లో చాలా మంది ఉండేవాళ్ళని అంతేగాక తన ఇంట్లో 16 ఏళ్ల నుంచి 18 సంవత్సరాలు నిండగానే ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేవారని తెలిపింది.

ఈ క్రమంలో తాను కూడా పెళ్లి వయసు రాగానే ప్రముఖ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ని పెళ్లి చేసుకుందామని అనుకున్నానని తన మనసులో మాట బయట పెట్టింది. అది కూడా కుదరకపోవడంతో చివరికి బాలీవుడ్ సినిమా పరిశ్రమలో పేరు పొందిన ప్రముఖ సింగర్ ని పెళ్లి చేసుకుందామని అనుకున్నానని కానీ అతడు చివరికి గే అని తెలియడంతో ఆ కల కూడా నెరవేరలేదని సరదాగా చెప్పుకొచ్చింది.

అయితే అతడు గే అయినందుకు తానేమీ ఉద్దేశపూర్వకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని ఒక రకంగా చెప్పాలంటే తాము ఎలాంటి వాళ్లమని చెప్పుకునే వారంటే తనకు ఎంతో అభిమానమని తెలిపింది.

Telugu Bollywood, Bollywood Gay, Jayasudha, Teluguveteran, Tollywood-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా జయసుధ చిన్నప్పుడు సినిమా షూటింగులకు హాజరయ్యే సమయంలో ఆమె తండ్రి కూడా తన వెంట వచ్చేవాడిని ఈ క్రమంలో ఎవరైనా తనతో సినిమా షూటింగ్ సెట్లో అసభ్యకరంగా మాట్లాడినా లేదా ప్రవర్తించిన తన తండ్రి అస్సలు ఊరుకునే వాడు కాదని తెలిపింది.ఆ విధంగా తన తండ్రి ఎంతో బాధ్యతగా తమతో మెలిగే వాడని తెలిపింది.అయితే ఈ విషయం ఇలా ఉండగా నటి జయసుధ కేవలం నటిగా మాత్రమే కాకుండా రాజకీయాల్లో కూడా చేరి ప్రజలకు సేవ చేసి మంచి రాజకీయ నాయకులు అధిక కూడా గుర్తింపు తెచ్చుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube