రజనీకాంత్ చెల్లెలికి కరోనా నెగిటివ్  

Jayanthi, Telugu veteran actress, Corona virus negative, Tollywood, Health news - Telugu Corona Virus Negative, Health News, Health Newsjayanthi, Jayanthi, Telugu Veteran Actress, Tollywood

టాలీవుడ్ సీనియర్ దర్శకుడు రవి రాజా పినిశెట్టి  దర్శకత్వం వహించిన “పెదరాయుడు” చిత్రంలో సూపర్ స్టార్ రజినీకాంత్ చెల్లెలి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించినటువంటి సీనియర్ నటి జయంతి ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకి బాగానే గుర్తుంటుంది.కాగా సినిమాల నుంచి విరామం తీసుకున్నప్పటి నుంచి నటి జయంతి తన కుటుంబ సభ్యులతో కలిసి కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో నివాసం ఉంటోంది.

 Telugu Veteran Actress Jayanthi Got Coronavirus Negative

అయితే ఈ మధ్య నటి జయంతి వయసు మీద పడడంతో కొంతమేర అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది.దీంతో తాజాగా జయంతి అస్వస్థతకు గురవడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

దాంతో వైద్యులు ఆమెకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కరోనా వైరస్ నెగిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు.ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వైరస్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కుటుంబ సభ్యులు ఆమెను వైద్యుల పర్యవేక్షణలోనే ఇంకొంత కాలం పాటూ ఉంచాలని  భావిస్తున్నట్లు తెలిపారు.

రజనీకాంత్ చెల్లెలికి కరోనా నెగిటివ్-Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఈ విషయం ఇలా ఉండగా నటి జయంతి తెలుగులో మోహన్ బాబు, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున, శోభన్ బాబు, తదితర స్టార్ హీరోలతో కలిసి పని చేసింది.కర్ణాటకలో పుట్టి పెరిగినటువంటి నటి జయంతి తెలుగు ప్రేక్షకులను మాత్రం తన నటనతో బాగానే మెప్పించింది.

#Jayanthi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Veteran Actress Jayanthi Got Coronavirus Negative Related Telugu News,Photos/Pics,Images..