స్విమ్మింగ్ సూట్ లో మతి పోగొడుతున్న వెటరన్ హీరోయిన్...

Telugu Veteran Actress Bhumika Chawla Looks Stunning In Swim Attire

తెలుగులో ప్రముఖ హీరో సుమంత్ హీరోగా నటించిన యువకుడు అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా  పరిచయమై క్రమక్రమంగా మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, విక్టరీ వెంకటేష్, నాగార్జున, తదితర స్టార్ హీరోల సరసన నటించి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ కొంత మంది అభిమానులను సంపాదించుకున్న తెలుగు హీరోయిన్ భూమిక చావ్లా గురించి తెలియని వారుండరు.వచ్చీరావడంతోనే తన ప్రతిభను నిరూపించుకున్నారు భూమిక చావ్లా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, హిందీ, తదితర భాషల్లో కూడా హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుని తనకంటూ కొంత మంది సినీ అభిమానులను సంపాదించుకుంది.

 Telugu Veteran Actress Bhumika Chawla Looks Stunning In Swim Attire-TeluguStop.com

కానీ ఇటీవల కాలంలో హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోవడంతో అక్క, అమ్మ, వదిన తదితర క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటిస్తూ బాగానే అలరిస్తోంది.

అయితే నటి భూమిక చావ్లా ఈమధ్య సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా  ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలను తన అభిమానులతో పంచుకుంటోంది.

 Telugu Veteran Actress Bhumika Chawla Looks Stunning In Swim Attire-స్విమ్మింగ్ సూట్ లో మతి పోగొడుతున్న వెటరన్ హీరోయిన్…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా తాజాగా భూమిక తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతున్నప్పుడు తీసినటువంటి ఫోటోని షేర్ చేసింది.దీంతో ఈ ఫోటోని కొంతమంది నెటిజన్లు తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

అలాగే భూమిక చావ్లా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటిస్తున్నప్పుడు సంప్రదాయ దుస్తులను చక్కగా కనిపించేదని కానీ ఉన్నట్లుండి ఇలా స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతున్న ప్పుడు తీసినటువంటి ఫోటోలు షేర్ చేయడంతో నెటిజన్లు అవాక్కయ్యారు.దీంతో కొందరు నెటిజనులు ఏకంగా నటి భూమిక చావ్లా కి నాలుగు పదుల వయస్సు దాటినా ఇప్పటికీ తన వన్నె తరగని అందంతో కుర్రకారు మతి పోగొడుతోందంటూ కొంటెగా కామెంట్లు చేస్తున్నారు.

Telugu Bhumika Chawla, Bhumikachawla, Bollywood, Teluguveteran-Movie

ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే నటి భూమిక చావ్లా తెలుగు యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా నటించిన సీటీమార్ చిత్రంలో హీరో అక్క పాత్రలో నటించి ప్రేక్షకులను బాగా అలరించింది.అలాగే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో నటి భూమిక చావ్లా కి సినిమా ఆఫర్లు కూడా బాగానే వరిస్తున్నాయి.అయితే ప్రస్తుతం నటి భూమిక చావ్లా హిందీ లో మిషన్ మజ్ను అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.కాగా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు ముంబై నగర పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.

#TeluguVeteran #BhumikaChawla #TeluguVeteran #Bhumika Chawla

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube