ప్లీజ్ నన్ను నమ్మండి... ఆ కేసుతో నాకెలాంటి సంబంధం లేదు...

ప్రస్తుతం బాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో అశ్లీల చిత్రాల చిత్రీకరణ కేసులో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రా వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది.ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు నటీనటులు తమకు మత్తు పదార్థాలను ఇచ్చి అశ్లీల చిత్రాలలో నటించాలని ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారు.

 Telugu Veteran Actress Asha Saini React About Raj Kundra Arrest In Bollywood-TeluguStop.com

ఈ క్రమంలో ఇటీవలే బాలీవుడ్ ప్రముఖ సీరియల్ హీరోయిన్ శృతి గెరా కూడా తనకు అశ్లీల చిత్రాలలో నటిస్తే డబ్బుతో పాటు పలు సినిమా అవకాశాలను కూడా ఇస్తామని ఆఫర్ చేసినట్లు తెలిపింది.అయితే తాజాగా ఈ అశ్లీల చిత్రాల చిత్రీకరణ వ్యవహారంలో టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన నటి “ఆశా సైని” పేరు బలంగా వినిపిస్తోంది.

అంతేగాక ఆశా సైని కి “ఆల్ట్ బాలాజీ” సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు కొందరు చర్చించుకుంటున్నారు.

 Telugu Veteran Actress Asha Saini React About Raj Kundra Arrest In Bollywood-ప్లీజ్ నన్ను నమ్మండి… ఆ కేసుతో నాకెలాంటి సంబంధం లేదు…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో తాజాగా ఆశా సైని సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఈ విషయంపై స్పందిస్తూ తనకు రాజ్ కుంద్రా వివాదంతో ఎలాంటి సంబంధం లేదని, కానీ కొందరు కావాలనే ఈ వివాదంలో తన పేరును ప్రస్తావిస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వాపోయింది.

అంతేకాకుండా నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు కథనాలను ప్రచారం చేయడం వల్ల ఇతరులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని ఆవేదన వ్యక్తం చేసింది.అయితే ఈ విషయం ఇలా ఉండగా గతంలో ఆశా సైని ప్రముఖ ఓటిటి అయిన ఆల్ట్ బాలాజీ లో ప్రసారమయ్యే పలు బోల్డ్ వెబ్ సిరీస్ లలో నటించింది.

దీంతో రాజ్ కుంద్రా వ్యవహారంలో ఆశా సైని కి కూడా సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.అయితే మరికొందరు మాత్రం చిత్రంలో నటీనటులు కేవలం స్క్రిప్ట్ డిమాండ్ వరంగా నటిస్తారని అంతే తప్ప వారికి దర్శక నిర్మాతలకి ఎలాంటి సంబంధం ఉండదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఆశా సైని తెలుగులో దాదాపుగా 50 కి పైగా చిత్రాలలో ప్రధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించింది.ఈ క్రమంలో పలు స్పెషల్ సాంగ్స్ తో పాటూ, గెస్ట్ అప్పీయరెన్స్, కామియో అప్పీయరెన్స్, తదితర పాత్రలలో నటించి బాగానే ఆకట్టుకుంది.కానీ ఈ మధ్య కాలంలో సినిమా అవకాశాలు కరువవడంతో బాలీవుడ్ కి వెళ్ళిపోయింది.అలాగే పలు బోల్డ్ వెబ్ సిరీస్ లలో నటిస్తోంది.

#Raj Kundra #Asha Saini #TeluguVeteran #ALT Balaji #VeteranActress

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు